Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఎలిమినేష‌న్ ఈసారి ఎవ‌రో తెల్సా?

By:  Tupaki Desk   |   21 Sep 2019 3:55 PM GMT
బిగ్ బాస్ ఎలిమినేష‌న్ ఈసారి ఎవ‌రో తెల్సా?
X
ఈసారి బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌టికి గెంటేసేది ఎవ‌రిని? రాహులేనా.. హిమ‌జను పంపించేస్తున్నారా? ఆ గుట్టు ఏమిటో విప్ప‌రా ప్లీజ్! ఏంటి విప్పేది.. డౌట్ లేకుండా రాహుల్ నే పంపించేస్తున్నార‌ని ఫిక్స‌యిపోయారా.. లేక హిమ‌జ‌కే టైమ్ అయిపోయిందా.. ఏది నిజం? ఏది అబ‌ద్ధం? తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

తెలుగింటి లోగిళ్ల‌లో మాస్ .. క్లాస్.. పిల్లా పీచూ అనే తేడా లేకుండా సాయంత్రాలు టీవీల‌కు అతుక్కుని ఆరాధ‌న‌గా చూస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతిని త‌నివి తీరా ఆస్వాధించ‌డంలో మ‌నోళ్లు ఘ‌నాపాటీలు అని ప్రూవ్ అవుతోంది. ఇప్ప‌టికే వ‌రుస‌గా చాలా ఎపిసోడ్స్ దాటుకుని తొమ్మిదో వారం విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న ఈ కార్య‌క్ర‌మంలో త‌దుప‌రి ఎలిమినేష‌న్ కి వేళ‌య్యింది. ఆదివారం రాత్రి 9పీఎం ఎపిసోడ్ తో ఆ సంగ‌తేదో తేలిపోనుంది.

అయితే తుపాకీకి ఎక్స్ క్లూజివ్ గా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి సింగ‌ర్ రాహుల్ ఎలిమినేట్ కావ‌డం లేదు. అత‌డికి ఓట్లు దండీగా ప‌డ్డాయి. అందుక‌ని సీక్రెట్ రూమ్ లోకి పంపుతార‌ట‌. కొన్నిరోజుల పాటు అక్క‌డే ఉండిపోతాడు. కానీ ఆ విష‌యం ఎవ‌రికీ తెలీదు. అస‌లు బిగ్ బాస్ లో ఏం జ‌రుగుతోందో ఆ సీక్రెట్ రూమ్ లో ఉండి లైవ్ అంతా చూస్తాడు. స‌డెన్ గా ట్విస్టిచ్చి లైవ్ లోకి వ‌చ్చేస్తాడు. అంద‌రికీ ఎలిమినేటెడ్ అని షాకిచ్చి రాహుల్ విష‌యంలో అలా ట్విస్టిస్తున్నార‌న్న‌మాట‌. బిగ్ బాస్ సీజ‌న్ 1లో ముమైత్ ఖాన్ .. బిగ్ బాస్ సీజ‌న్ 2లో నూత‌న్ నాయుడు విష‌యంలో ఇలానే చేశారు. ఇంత‌కీ హిమ‌జ ఎలిమినేట్ అయిన‌ట్టేనా? అంటే అవున‌నే క‌న్ఫామ్ అయ్యింది. త‌న‌కు వ‌చ్చిన ఓట్ల శాతం త‌క్కువ‌గా ఉంద‌ని తెలిసింది. మొత్తానికి ఇద్ద‌రి ఎలిమినేష‌న్ అని టెన్ష‌న్ పెట్టినా అస‌లు నిజం ముందే తెలిసిపోయింది. హిమ‌జ వెళ్లిపోవ‌డం ఖాయ‌మైంది. ఫ్యాన్స్ గుండెలు ల‌బోదిబోమ‌న్నా త‌ప్ప‌దు మ‌రి. ఏడుపులు పెడ‌బొబ్బ‌లు.. కారాలు మిరియాలు ఇలా అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ని కొలీగ్స్ తో క‌లిసి బాగా ఎంజాయ్ చేసిన హిమ‌జ ఇక సొంత ఇంటికి వెళ్లే టైమొచ్చింద‌ట‌.