Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ బ్యూటీ హిమజ 'జ' ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   2 Nov 2020 2:40 PM IST
బిగ్ బాస్ బ్యూటీ హిమజ జ ఫస్ట్ లుక్..!
X
'బిగ్ బాస్ 3' తెలుగు రియాలిటీ షో తో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మ హిమజ. 'ఉన్నది ఒకటే జిందగీ' 'నేను శైలజ' 'నెక్స్ట్ నువ్వే' 'ధృవ' 'మహానుభావుడు' 'స్పైడర్' వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన హిమజ.. 'బిగ్ బాస్' షో తో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు - బుల్లి తెర షోస్ - టీవీ సీరియల్స్ అంటూ వరుస ఆఫర్స్ తో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' లో కూడా హిమజ నటించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో హిమజ ప్రధాన పాత్రలో ఓ హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ హారర్ సినిమాకు ''జ'' అనే టైటిల్ ని ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

''జ'' ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్ గా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. హిమజ భయంతో గట్టిగా అరుస్తూ ఉండగా ఆమె తలపై రక్తంతో తడిసిన చేయి కనిపిస్తోంది. అలానే కింది నుంచి అనేక చేతులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ భయానకంగా ఉంది. ఈ చిత్రాన్ని జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్నారు. సైది రెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నారు. వేంగి సంగీతం అందిస్తుండగా శివ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ పవన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. హిమజ ఫస్ట్ టైం నటిస్తున్న 'జ' హారర్ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.