Begin typing your search above and press return to search.

రంగస్థలం ప్రీ రిలీజ్ లో తీన్మార్ స్పెషల్

By:  Tupaki Desk   |   7 March 2018 10:46 PM IST
రంగస్థలం ప్రీ రిలీజ్ లో తీన్మార్ స్పెషల్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రంగస్థలం సినిమా మొత్తానికి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెలాఖరున సినిమా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా కథానాయకుడు రామ్ చరణ్ తన డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేశాడు. దర్శకుడు సుకుమార్ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను ప్రశాంతంగా ఫినిష్ చేశాడు. ఎక్కడా కూడా ఏ చిన్న పని మిగలకుండా విడుదలకు పది రోజుల ముందే అన్ని ఫినిష్ చేస్తున్నారు.

ఇకపోతే సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండలని చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తోంది, మైత్రి మూవీ మేకర్స్ కూడా భారీగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యింది. రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్లాన్ చేస్తున్నారు. మెగా అభిమానులు ఈవెంట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్నారు. భారీ సంఖ్యలో వస్తున్నందున వారికీ అనుకలంగా ఉండడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే సుకుమార్ తన కొత్త ఆలోచనలను ప్రీ రిలీజ్ వేడుకలో కూడా చూపించబోతున్నాడు.

మూడు విభిన్నమైన కార్యక్రమాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయట. మొదట గోదావరి స్టైల్ లో ఒక బుర్ర కథను ప్లాన్ చేశాడు. అందులో చిత్ర యూనిట్ గురించి వివరణ ఉంటుందట. ఇక రెండవది: ఆంధ్ర ట్రెడిషినల్ ఫోక్ డ్యాన్స్ అయిన తప్పెట గుళ్లు ప్రోగ్రాం ని సెట్ చేయిస్తున్నారు. ఇక మూడవది చాలా స్పెషల్. లోకల్ తీన్ మార్ తరహాలో ఉండాలని లైవ్ చోడవరం డప్పు పర్ఫెమెన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ రంగస్థలం పాటలను లైవ్ లో పాడి ఆకట్టుకోబోతున్నట్లు టాక్.