Begin typing your search above and press return to search.

ఫలక్ నుమా దాస్ లో ఆ షాట్ రచ్చటగా!

By:  Tupaki Desk   |   14 Feb 2019 11:51 AM GMT
ఫలక్ నుమా దాస్ లో ఆ షాట్ రచ్చటగా!
X
బోల్డ్ చిత్రాల ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ మరో సినిమా 'ఫలక్ నుమా దాస్' ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్వక్ సేన్ దర్శకుడిగా ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ నిన్నే విడుదలైంది. రా అండ్ బోల్డ్ స్టైల్ లో ఉన్న ట్రైలర్ ఆడియన్స్ ను షాక్ కు గురిచేసింది. టీజర్లో ఫుల్ గా వాడిన బూతులపై విమర్శలు ఉన్నా తెలుగు సినిమాలలో కొత్తదనం ఆశించేవారికి.. ఈ జెనరేషన్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అయింది. కొంతమంది ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' స్టైల్ లో ఉందని పోలికలు తీసుకురావడం మొదలు పెట్టారు.

ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'అంగామలి డైరీస్' కు రీమేక్ గా తెరకెక్కుతోంది. లోకల్ గ్యాంగ్స్ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో 2017 లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా మలయాళం వెర్షన్ లో క్లైమాక్స్ 11 నిముషాల సింగిల్ షాట్ దర్శకుడు లిజో జోస్ కు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా ఉండే ఆ షాట్ ను సింగిల్ టేక్ లో చిత్రీకరించడం విశేషం. దీంతో తెలుగు వెర్షన్ లో ఆ సీన్ ఎలా చిత్రీకరించారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఈ షాట్ ను 'ఫలక్ నుమా దాస్' లో కూడా తన ఫ్రెండ్ తరుణ్ భాస్కర్ సహకారంతో విష్వక్ సేన్ అలానే చిత్రీకరించడం జరిగిందట. ఒకవేళ ఈ సన్నివేశం పండితే తెలుగులో సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ పై భారీగా చర్చ జరుగుతోంది కాబట్టి సినిమాపై ఆసక్తి కూడా పెరుగుతోంది. అంతా బాగానే ఉంది గానీ ప్రేక్షకులకు 'ఫలక్ నుమా దాస్' కు మధ్యలో సెన్సార్ వారు ఉన్నారు కదా.. వారు ఎన్ని 'బీప్' లు ఇస్తారో వేచి చూడాలి!