Begin typing your search above and press return to search.

చైతూ కెరీర్‌ లోనే అన్నింటికి మించి...!

By:  Tupaki Desk   |   8 Sep 2022 12:30 AM GMT
చైతూ కెరీర్‌ లోనే అన్నింటికి మించి...!
X
నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు చవిచూశాడు. చాలా అంచనాలు పెట్టుకుని నటించిన థ్యాంక్యూ మరియు బాలీవుడ్‌ సినిమా లాల్ సింగ్ చడ్డా రెండూ కూడా నాగ చైతన్య కి మరియు ఆయన అభిమానులకు నిరాశ ని మిగిల్చాయి. ఆ సినిమాల ఫ్లాప్ నుండి చైతూ వెంటనే బయటకి వచ్చేసి ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమాను తెలుగు మరియు తమిళంలో ఏక కాలంలో రూపొందించబోతున్నారు. నాగ చైతన్య ఈ సినిమాతో మొదటి సారి తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నాడు. అలాగే దర్శకుడు వెంకట్‌ ప్రభు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతోనే మొదటి సారి రాబోతున్నాడు.

నాగ చైతన్య కెరీర్‌ లోనే ఇప్పటి వరకు సోలో హీరోగా నటించిన సినిమాలకు ఖర్చు పెట్టనంత ఎక్కువ బడ్జెట్‌ ను దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు ఖర్చు చేయించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమా బడ్జెట్‌ కి తగ్గట్లుగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు నాగ చైతన్య ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాడు.. అలాగే గెటప్స్ ని కూడా డిఫరెంట్‌ డిఫరెంట్‌ గా చైతూ చూపించాడు. కానీ మొదటి సారి నాగ చైతన్య ఈ సినిమా కోసం అంతకు మించి అన్నట్లుగా డిఫరెంట్‌ లుక్ లో కనిపించబోతున్నాడు.

ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని సినిమాల్లో నటిస్తున్న నాగ చైతన్య కి ఈ సినిమా కచ్చితంగా హిట్ ను తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.