Begin typing your search above and press return to search.

భరత్ అమరావతి ఫైట్ అరుపులేనట

By:  Tupaki Desk   |   14 April 2018 6:30 AM GMT
భరత్ అమరావతి ఫైట్ అరుపులేనట
X
మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను హంగామా జోరు మీద ఉంది. సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమే హద్దు అన్న తరహాగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భరత్ అనే నేను మూవీపై వస్తున్న ప్రతీ అప్ డేట్ ఆసక్తి కలిగిస్తోంది.. ఆన్ లైన్ లో వైరల్ అయిపోతోంది.

సీఎం పాత్రలో మహేష్ బాబు నటించడమే ఈ చిత్రానికి ప్రధానమైన హైలైట్ అయితే.. మూవీకి ఆకర్షణగా నిలిచే మరో అంశం ఇందులో ఉంటుందట. అమరావతి థియేటర్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సుదీర్ఘంగా ఉండే ఈ యాక్షన్ ఎపిసోడ్.. మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. మహేష్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు మూవీలో కూడా ఇలాగే ఓ మామిడితోట ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది.

ఈ సన్నివేశం ఆరంభమయ్యే సీన్ నుంచి.. చివరి వరకూ ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా రెప్ప వేయనీయని రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా అంతకు మించి ఎఫెక్ట్ చూపించే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 5 నిమిషాల పాటు ఉండే అమరావతి థియేటర్ ఎపిసోడ్.. సినిమా అయిపోయిన తర్వాత కళ్ల ముందు మెదలడం ఖాయం అంటున్నారు.