Begin typing your search above and press return to search.

సినిమా థియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   6 Oct 2021 2:30 AM GMT
సినిమా థియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
X
తమిళనాడు సినిమా థియేటర్లలోకి వాటర్ బాటిల్స్ ను జ్యూస్ బాటిల్స్ ను తీసుకు రావడం నిషేదించాలని తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్ట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు వాటర్ బాటిల్స్ తీసుకు రావద్దు అంటే థియేటర్ల యాజమాన్యాలు ఖచ్చితంగా థియేటర్ లో ఫ్యూరిఫైడ్‌ కూలర్‌ వాటర్‌ ను అందించాలని.. శుభ్రమైన వాటర్ ను అందించినట్లయితే ప్రేక్షకులు థియేటర్ లోనికి వాటర్ బాటిల్స్ ను తీసుకు వెళ్లే అవకాశం ఉండదు కదా అంటూ కోర్టు ప్రశ్నించింది. మొదట యాజమాన్యాలు ఆ విషయమై దృష్టి పెట్టాలని.. ఆ తర్వాత మాత్రమే థియేటర్లలోకి వాటర్ బాటిల్స్ ను నిషేదించాలని కోర్టు ఆదేశించింది.

ఎస్‌ 2 సినిమాస్ అనే థియేటర్ వాటర్ బాటిల్స్ మరియు జ్యూస్ లపై అత్యధిక రేటును వేస్తున్నారని.. 2016 లో హైకోర్టులో దేవరాజన్‌ అనే వ్యక్తి పిటీషన్ వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే రాష్ట్రంలోని థియేటర్లలో పూర్తి స్థాయిలో వాటర్ బాటిల్స్ ను అనుమతించకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణ సందర్బంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేయడం జరిగింది.

థియేటర్లలోకి వాటర్‌ బాటిల్స్ ను అనుమతించని పక్షంలో అక్కడ అందరికి ఆమోదయోగ్యమైన వాటర్ ను అందించాలని.. వాటర్ తాగేందుకు డిస్పోజబుల్‌ గ్లాస్‌ లను వినియోగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటర్ కూలర్లను థియేటర్లలో పూర్తి స్థాయిలో ఇన్ స్టాల్‌ చేసిన తర్వాతే బాటిల్స్ అనుమతించకూడదు అనే నిర్ణయాన్ని అమలు చేయాలని హైకోర్టు క్లీయర్ గా తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో కూడా చర్చించాల్సిందిగా కోర్టు సూచించింది. మరి రాష్ట్రంలో అన్ని థియేటర్లలో వాటర్ కూలర్‌ లను ఉంచడం సాధ్యమా అనేది చర్చనీయాంశంగా మారింది.