Begin typing your search above and press return to search.

'దిశా ఎన్ కౌంటర్' మూవీకి చుక్కెదురు.. విడుదలకు హైకోర్టు బ్రేక్!

By:  Tupaki Desk   |   15 Jun 2021 2:30 AM GMT
దిశా ఎన్ కౌంటర్ మూవీకి చుక్కెదురు.. విడుదలకు హైకోర్టు బ్రేక్!
X
టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లేటెస్ట్ సినిమాకు తాజాగా హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే వర్మ దగ్గరుండి మరీ తెరకెక్కించిన 'దిశ ఎన్‌కౌంటర్' సినిమాను మొదటగా సెన్సార్ బోర్డు కమిటీ నిరాకరించింది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన ఆధారంగా ఉందని.. ఆ ఘటనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రంలో కనిపించాయని సెన్సార్ కమిటీ సభ్యులు సర్టిఫై చేయడానికి కుదరదని చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యులలో నలుగురు 'దిశ ఎన్‌కౌంటర్' సినిమాకు నో చెప్పడంతో నిర్మాతలు రివిజన్ కమిటీని ఆశ్రయించి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ పొందారు.

ఇదివరకే ఈ మూవీ పై దిశ తల్లితండ్రులతో పాటు పోలీసులు కూడా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక వారు హైకోర్టుకు వెళ్లడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే 2019 హైదరాబాద్ శివారులో జరిగిన 'దిశ' హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. కామాంధుల వలలో చిక్కుకొని అత్యంత ఘోరంగా హతమార్చబడింది దిశ. అందుకు సంబంధించిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించిన వర్మకి అప్పట్లోనే షాకిచ్చింది సెన్సార్ బోర్డు.

ఇదివరకే 'దిశ ఎన్‌కౌంటర్' సినిమా ట్రైలర్ ట్రైలర్, టీజర్స్ కూడా విడుదల చేసాడు వర్మ. ఆ సమయంలోనే దిశ పేరెంట్స్ అభ్యంతరం తెలిపి పోలీసులను ఆశ్రయించారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు. ప్రస్తుతం ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ లభించింది. కానీ మధ్యలో వర్మ ఈ సినిమా దిశాకు బయోపిక్ కాదని మాట మార్చాడు. తాజాగా హైకోర్టు సినిమా విడుదలను 2వారాలు వాయిదా వేసింది. అలాగే మేకర్స్ కూడా ప్రస్తుతం దిశా కాకుండా సినిమాకు 'ఆశా ఎన్ కౌంటర్'గా పేరు మార్చినట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు ఆర్జీవికి ఎలాంటి సంబంధం లేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా.. నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది.