Begin typing your search above and press return to search.
కాజల్, దుల్కర్ ‘హే సినామిక’ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే..?
By: Tupaki Desk | 29 Dec 2020 10:16 AM ISTమోలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ కాజల్, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రల్లో.. ప్రముఖ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ బృంద దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హే సినిమాక’. ఈ ఏడాది మార్చి రెండవ వారంలో చెన్నైలో ప్రారంభమైన ఈ మూవీ.. లాక్ డౌన్ తర్వాత తిరిగి నవంబర్‌లో స్టార్ట్ అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకొని ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నో సినిమాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన బృంద.. ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన దుల్కర్ తోపాటు.. కాజల్ కూడా ఈ సినిమాలో నటించడంతో ప్రేక్షకులు భారీ అంచనాలే ఉన్నాయి.
గ్లోబల్ వన్ స్టూడియోతో కలిసి జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా జియో స్టూడియోస్ కోలీవుడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోపాటు రిలీజ్ డేట్ కూడా త్వరలో ప్రకటించనుంది చిత్ర యూనిట్.
కాగా.. ‘హే సినామిక’ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో ఇప్పుడు దుల్కర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే మల్టీ లింగ్వల్ మూవీపై ఫోకస్ చేస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కార్గిల్ వార్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో దుల్కర్ సైనికుడుగా కనిపించబోతన్నాడు. అయితే.. ఇదో అందమైన ప్రేమ కథగా తెలుస్తోంది. జనవరిలో సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.