Begin typing your search above and press return to search.

మంచు విష్ణు కి జోడీగా తెరపైకి మరో హీరోయిన్..!

By:  Tupaki Desk   |   27 Nov 2020 1:40 PM IST
మంచు విష్ణు కి జోడీగా తెరపైకి మరో హీరోయిన్..!
X
మంచు విష్ణు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'డి అండ్‌ డి - డబుల్‌ డోస్‌' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 2007లో వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఢీ' కి సీక్వెల్ గా ఈ చిత్రం రానుంది. మంచు విష్ణు తన పుట్టినరోజు సందర్భంగా 'డి & డి' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ పోస్టర్ కూడా విడుదల చేసారు. అవరమ్‌ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఢీ’తో పోలిస్తే... డబుల్‌ కామెడీ మరియు యాక్షన్‌ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీద‌కు తీసుకొస్తారో తెలీదు కానీ విష్ణు స‌ర‌సన హీరోయిన్ అంటూ రోజుకో బ్యూటీ పేరు మీడియా వర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పటికే ఈ చిత్రంలో విష్ణుకి జోడీని వెత‌క‌డం స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. 'ఢీ' చిత్రంలో విష్ణు సరసన హీరోయిన్ జెనీలియా నటించగా.. 'డి & డి' చిత్రంలో యువ హీరోయిన్లను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' 'మహా సముద్రం' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ని విష్ణు కోసం ఎంపిక చేసారని టాక్ వచ్చింది. అలానే ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్ ని తీసుకునే అవ‌కాశం కూడా ఉందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో తాజాగా హిరోషిని కోమలి ని హీరోయిన్ గా తీసుకుంటున్నార‌ని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కోమలి తెలుగులో 'అ ఆ' సినిమాలో నితిన్ కి చిన్న చెల్లిగా నటించింది. అలానే గతేడాది 'ఉట్రాన్' అనే సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు విష్ణు సినిమాలో తీసుకుంటున్నారని అంటున్నారు. మరి చివరకు విష్ణు కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి గోపీమోహన్‌ - కిశోర్‌ గోపు రచయితలుగా వర్క్ చేస్తున్నారు. మోహనకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.