Begin typing your search above and press return to search.

అతిలోక సుందరి.. అంత అవసరమా?

By:  Tupaki Desk   |   26 Jun 2017 10:04 AM GMT
అతిలోక సుందరి.. అంత అవసరమా?
X
సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్లు తెరపైనే కాకుండా సినిమా ప్రమోషన్ సమయాల్లోనూ తమలోని గ్లామర్ కంటెంట్ చూపించేందుకు తెగ ట్రై చేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో తాము తక్కువ కాదంటూ పబ్లిక్ ఈవెంట్లలో తమ అందాలను ఆరబోసేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన దువ్వాడ జగన్నాథమ్ సినిమా ప్రమోషన్లకు వచ్చిన ఆ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే తన ఫ్యాషన్ అప్పీల్ తో అందరినీ తెగ అట్రాక్ట్ చేసింది. ఈ గ్లామర్ షో సినిమాకు ప్లస్సవడంతో పాటు కొత్త ఛాన్సులు తెచ్చిపెట్టే అవకాశం ఉండటంతో హీరోయిన్లు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

అవకాశాల కోసమో.. గుర్తింపు కోసమో ప్రస్తుత హీరోయిన్లు చేస్తున్న పబ్లిక్ ఎక్స్ పోజింగ్ ను సీనియర్ నటీమణులు ఫాలో అవుతుండటం ఇప్పుడు డిస్కషన్ పాయింటవుతోంది. అతిలోక సుందరి శ్రీదేవి తన లేటెస్ట్ సిినిమా మామ్ ప్రమోషన్లలో భాగంగా టీవీ ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలిస్తోంది. ఈ సందర్భంగానే బాహుబలిలో శివగామి క్యారెక్టర్ చేయడానికి గొంతెమ్మ కోరికలు కోరిందంటూ దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్లకు సమాధానమిచ్చింది. ఇంతవరకు బాగానే ఈ టీవీ షోకు శ్రీదేవి వేసుకొచ్చిన డ్రస్ పైనే ఇప్పుడు ఎక్కడలేని విమర్శలు వస్తున్నాయి. ఈ షోకు శ్రీదేవి తన క్లీవేజ్ అందాలను ప్రదర్శించే డ్రస్ తో రావాల్సిన అవసరమేం ఉందనే ప్రశ్న వస్తోంది. 50 లకు వచ్చినా తనలో గ్లామర్ కంటెంట్ ఇప్పటికీ తగ్గలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వయసులో పబ్లిక్ షోల్లో డిగ్నిఫైడ్ గా ఉండే డ్రస్సింగే ఆమెకు శోభనిస్తుందనడంలో సందేహం లేదు.

శ్రీదేవి లేటెస్ట్ సినిమా మామ్ జులై 7న రిలీజ్ కానుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సెలక్టివ్ గానే సినిమాలు చేస్తున్న ఆమె మామ్ కు మాత్రం గట్టిగానే ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగానే తెలుగు టీవీ ఛానళ్లకు సైతం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిస్తోంది. తన జీవితంలో ఎదురైన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో ఆమె లీడ్ రోల్ లో కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/