Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్: చరణ్ తారక్ ల భామలు వీళ్ళే

By:  Tupaki Desk   |   14 March 2019 12:51 PM IST
ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్: చరణ్ తారక్ ల భామలు వీళ్ళే
X
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ హీరొయిన్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడిపోయింది. హీరొయిన్లు ఎవరు అన్న విషయం రాజమౌళి స్వయంగా ప్రకటించేశారు. చరణ్ సరసన అలియా భట్ తారక్ సరసన డైజీ అడ్గార్జియోన్స్ నటిస్తారని క్లారిటీ ఇచ్చేసారు. ఓసారి ఎయిర్ పోర్ట్ లో అలియా భట్ ని కలుసుకున్నప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగిందని ఇందులో సీత పాత్ర పట్ల తను చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సో ఫైనల్ గా తననే సెలెక్ట్ చేసుకున్నట్టు ధ్రువీకరించారు.

ఇక డైజీ గురించి డైనమిక్ లేడీ అని చెప్పిన రాజమౌళి తన గురించిన పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి అతి కీలకమైన అప్ డేట్ ఇదే. గత రెండు మూడు రోజులుగా అలియా భట్ నో చెప్పిందని రాజమౌళి సినిమా అయినా తాను డబ్బు కోసం ఒప్పుకోనని చెప్పిందని రకరకాలుగా మీడియా ప్రచారం జరిగింది.

దానికి తోడు రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ లో భాగంగా ఉన్న అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ కు బల్క్ డేట్స్ ఇవ్వడం గురించి పలు కథనాలు కూడా వచ్చాయి. అయితే రాజమౌళి ఇచ్చిన పాత్ర చిన్నదో లేక తక్కువ కాల్ షీట్స్ లో పూర్తయ్యేలా ప్లాన్ చేశాడో తెలియదు కాని మొత్తానికి అలియా లైన్ లోకి వచ్చింది. ఇక ఆ డైజీ గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చరణ్ తారక్ ఇద్దరితోనూ ఏ సౌత్ హీరొయిన్ నటించడం లేలేదన్నది పక్కా అయిపోయింది.