Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సైమాలో సొగసు గత్తెల పండగ!

By:  Tupaki Desk   |   17 Sept 2018 12:58 PM IST
ఫోటో స్టొరీ: సైమాలో సొగసు గత్తెల పండగ!
X
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2018 దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ చిత్రసీమలకు చెందిన వారందరూ ఒక చోట చేరితే అంతకుమించిన ఫిలిం ఈవెంట్ ఏముంటుంది? ఇక ఇలాంటి ఈవెంట్స్ లో అందరి దృష్టి స్టార్ హీరోల కంటే అందాల భామల పైనే ఉంటుంది కదా..!

దానికితగ్గట్టే హీరోయిన్లు తళుకుబెళుకుల డిజైనర్ డ్రెస్సులు వేసుకొని వేదికపై వెలుగు జిలుగుల్లో కనిపించారు. శ్రియ - ప్రణీత - సంజన - శాన్వి - హన్సిక - నభ నటేష్ - ప్రగ్య జైస్వాల్ లాంటి అందగత్తెలందరూ రెడ్ కార్పెట్ పై నడవడమే కాకుండా వేదికపై సూపర్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. అసలే అందాలభామలు పైగా తమ అందాలను ఇనుమడింపజేసే డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ చేస్తే ఇక చూసే వారి మనసులు హిమాలయాల అంచుల దాకా వెళ్ళకుండా ఉంటాయా?

మరి ఆ బ్యూటీలందరి ఫొటోలను ఒక కొల్లేజ్ లాగా చేస్తే.. ఒకే ఫ్రేం లో ఉంటారు కదా. అలాంటిదే ఈ ఫోటో. ఇలాంటివి చూస్తున్నప్పుడే మనకు దేవుడు రెండు కళ్ళు ఎందుకుచ్చాడు? రెండు డజన్ల కళ్ళు ఇస్తే బాగుండేది కదా అనిపించేది! ఆ ఛాన్స్ లేదు కాబట్టి మీకున్న రెండు కళ్ళతోనే ఈ కొల్లేజ్ ను చూసి ఆస్వాదించండి.