Begin typing your search above and press return to search.

రాజుగారి గదికి హీరోయిన్ల సమస్య!

By:  Tupaki Desk   |   15 July 2019 3:44 PM IST
రాజుగారి గదికి హీరోయిన్ల సమస్య!
X
దర్శకుడు ఓంకార్ ప్రస్తుతం 'రాజుగారి గది 3' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుందని కూడా అన్నారు. కానీ తమన్నా లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో మరో హీరోయిన్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సినిమా కోసం తాప్సీ ని సంప్రదించారని.. అయితే తాప్సీ కూడా నో చెప్పడంతో ఓంకార్ టీమ్ మరో హీరోయిన్ కోసం కసరత్తు చేస్తున్నారట. తాజాగా కాజల్ అగర్వాల్ ను సంప్రదించారట. అయితే కాజల్ భారీ రెమ్యూనరేషన్ కోట్ చేయడంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి 'రాజుగారి గది 3' టీమ్ మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టారట. ఈ సినిమాను దర్శకుడు ఓంకార్ స్వయంగా నిర్మిస్తున్నారు. మరి హీరోయిన్ లు ఇలా సినిమాను రిజెక్ట్ చేయడానికి రెమ్యూనరేషన్ ఇష్యూ ఒక్కటేనా లేక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం లాంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం శర్వానంద్ సినిమా 'రణరంగం'.. తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' చిత్రాలలో నటిస్తోంది. అయితే ఇవన్నీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి.. ఇవి కాకుండా కొత్త అఫర్లు ఏమీ లేవు. ఈమధ్య నటించిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. మరి ఇలాంటి సమయంలో చేతిలో వచ్చి వాలిన ఆఫర్ ను భారీ రెమ్యూనరేషన్ పేరుతో ఎందుకు వద్ధనుకుందో ఏంటో.