Begin typing your search above and press return to search.

ఇలాంటి స్క్రిప్టులు చాలా రేర్: తాప్సీ

By:  Tupaki Desk   |   25 May 2019 10:10 AM GMT
ఇలాంటి స్క్రిప్టులు చాలా రేర్: తాప్సీ
X
డింపుల్ బ్యూటీ తాప్సీ మొదట్లో సౌత్ సినిమాలలోనే ఎక్కువగా నటించింది కానీ తర్వాత బాలీవుడ్ లో పాగా వేసింది. 'పింక్' సినిమా తాప్సీకి బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి వరసగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు.. డిఫరెంట్ గా ఉన్న స్క్రిప్టులు ఎంచుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతోంది. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత తాప్సీ 'గేమ్ ఓవర్' అనే ఒక తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జూన్ 14 న రిలీజ్ కానుంది.

నయనతార తో 'మాయ' సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా గురించి తాప్సీ చాలా గొప్పగా చెప్తోంది. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయని.. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకం ఉందని చెప్పింది. ఈ సినిమాలో తాప్సీ ఒక వీల్ చైర్ కు పరిమితమైన గేమర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మొదట తెలుగు.. తమిళం మాత్రమే అనుకున్నారట. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ హిందీలో ప్రెజెంట్ చేసేందుకు ముందుకొచ్చారట.

ఈ సినిమాకు రాన్ యోహాన్ సంగీత దర్శకుడు. 'గేమ్ ఓవర్' చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీ ఈ చిత్రంతో మరో విజయం నమోదు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.