Begin typing your search above and press return to search.

#RRR కోసం వాళ్లూ Rలే కావాలట

By:  Tupaki Desk   |   28 March 2018 4:31 AM GMT
#RRR కోసం వాళ్లూ Rలే కావాలట
X
పేరు కూడా ప్రకటించకుండానే ట్రెండింగ్ అయిపోవడం అంటే.. ఆ సినిమాపై జనాల్లో ఉన్న ఆసక్తికి అద్దం పట్టే విషయం అది. #RRR అంటూ రాజమౌళి-రామ్ చరణ్- రామారావుల కాంబినేషన్ మూవీ అనౌన్స్ మెంట్ నుంచి ఈ ప్రాజెక్టు గురించి రకరకాల అంచనాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి.. ఇప్పుడు హీరోయిన్ల వేట సాగుతోందని తెలుస్తోంది.

హీరోలు ఇద్దరి పేర్లను R అనే ముందు అక్షరంతో ఆరంభం అయ్యేలా సెట్ చేసిన దర్శకుడు రాజమౌళి.. హీరోయిన్ పేర్ల విషయంలో కూడా ఇదే పాటిస్తున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అంటే ఇద్దరు హీరోల పక్కన నటించి అందాల భామల పేర్లు కూడా R ఉండాలన్న మాట. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్.. రాశి ఖన్నా.. వీరిద్దరి పేర్లను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. వీరిద్దరిలో ఒకరిని అప్రోచ్ అయ్యారని కూడా అంటున్నారు. వీరితో పాటు కన్నడ భామ రష్మిక మందన పేరు కూడా పరిశీలనలో ఉందట.

ఇలా R అనే అక్షరంతో మొదలయ్యే ఇతర హీరోయిన్లను కూడా పరిశీలిస్తున్నా.. రకుల్.. రష్మిక.. వీరిద్దరి పైనా ఫోకస్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే.. ఇద్దరినీ సౌత్ ఇండియన్ భామలను కాకుండా.. ఒకరిని ఇక్కడ నుంచి తీసుకుని.. మరొకరిని బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేయాలని కూడా జక్కన్న యోచిస్తున్నాడట. వీలైనంత త్వరలోనే ఈ విషయంపై ఫుల్ డీటైల్స్ రానున్నాయని టాక్.