Begin typing your search above and press return to search.
డ్రగ్ కేసులో బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో హీరోయిన్స్...!
By: Tupaki Desk | 30 Sept 2020 12:15 PM ISTశాండిల్ వుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమలో అనేకమంది నటీనటులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో హీరోయిన్స్ రాగిణి ద్వివేది - సంజన గల్రాని లను అరెస్టు చేశారు. అయితే వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. సంజన - రాగిణి లకు బెయిల్ మంజూరు చేయడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. అలానే ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ ప్రకాష్ - వినయ్ కుమార్ ల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించిందని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరి బెయిల్ పిటిషన్లను కోర్టు ఈరోజు విచారించనుంది.
ఇదిలా ఉండగా రాగిణి ద్వివేది - సంజన గల్రాని బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ తెలిపారు. ఆర్డర్స్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని పరిశీలించి హైకోర్టును ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు. కాగా, డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. అదే క్రమంలో హీరోయిన్ సంజన గల్రానిమరియు ఆమె తల్లికి కూడా డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని గుర్తించి సెప్టెంబర్ 9న వారిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు రాహుల్ - వీరేన్ ఖన్నా - రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో మరికొందరు నటీనటులను యాంకర్లను కూడా సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు.