Begin typing your search above and press return to search.

సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు

By:  Tupaki Desk   |   18 Sept 2020 9:45 AM IST
సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు
X
శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు లో సౌత్ ఆఫ్రికా దేశ పౌరులే సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు.

పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బెనాల్ట్ ఉడేన్నా అనే ఆఫ్రికన్ ను అరెస్ట్ చేశారు. కన్నడ సినిమా రంగానికి చెందిన సెలెబ్రెటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్యా ఆళ్వాకు చాలా సన్నిహితుడని.. డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవారని తెలిసింది.

బెంగళూరు తో పాటు చుట్టుపక్కల రిసార్ట్ లో మధ్య రాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.

ఆదిత్య ఆళ్వాకు చెందిన రిసార్ట్‌ పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్‌ చేస్తుండగానే ముగ్గురు కింగ్‌పిన్‌ లు పరారు కావడం తో కేసు పై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతో మంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు.

ఈ కింగ్‌పిన్‌ లు నటీ మణులు రాగిణి, సంజనల తో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాల కు పారి పోయి ఉంటాడని భావిస్తున్నారు.