Begin typing your search above and press return to search.

జైల్లో హీరోయిన్ల‌ కుమ్ములాటతో జైల‌ర్ల‌కు వినోదం ఫ్రీ

By:  Tupaki Desk   |   14 Sept 2020 11:15 AM IST
జైల్లో హీరోయిన్ల‌ కుమ్ములాటతో జైల‌ర్ల‌కు వినోదం ఫ్రీ
X
శాండ‌ల్ వుడ్ స‌హా బాలీవుడ్ లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. బాలీవుడ్ లో సుశాంత్ మ‌ర‌ణంలో సినీ ఇండ‌స్ట్రీల‌న్నీ వ‌ణికిపోతున్నాయి. సుశాంత్ మ‌ర‌ణానికి డ్ర‌గ్స్ ‌కి లింక్‌ వుంద‌ని తేల‌డం.. అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ ఈ కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా అనుమానిస్తున్న రియా చ‌క్ర‌వర్తికి డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ ‌ల‌తో నేరుగా కాంటాక్ట్ లు వున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఈ కోణంలో సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు చేయ‌డం మొద‌లుపెట్టారు.

తాజా విచార‌ణ‌లో రియా టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ ‌సింగ్ పేరుని కూడా బ‌య‌టిపెట్టింద‌ని వార్త‌లు రావ‌డంతో టాలీవుడ్ లో మ‌ళ్లీ డ్ర‌గ్స్ ప్ర‌కంప‌నలు మొద‌ల‌య్యాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ డ్ర‌గ్స్ లింకులో బాలీవుడ్ హీరోయిన్ల జాబితాను ఎన్.సి.బి బృందాలు అధికారికంగా అయితే రిలీజ్ చేయ‌నేలేదు. ఆ మేర‌కు ఎన్.సి.బి అధికారి వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే బాలీవుడ్ మీడియా స‌హా టాలీవుడ్ మీడియాలో ర‌కుల్ పేరు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇక‌ రియా కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతుండ‌గానే క‌న్న‌డ చిత్ర సీమ‌లో డొంక క‌దిలింది. ఈ వివాదంలో రాగిణి దివ్వేది.. సంజ‌న గ‌ల్రానీల పేర్లు బ‌య‌టికి రావ‌డంతో ఈ ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవ‌డం వారిని రిమాండ్ కి పంప‌డం తెలిసిందే.

వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం మ‌డివాడ మ‌హిళా సంర‌క్ష‌ణ పున‌ర్వ‌స‌తి కేంద్రంలో వున్నారు. తాజా వివాదానికి నువ్వంటే నువ్వు కార‌ణ‌మంటూ రాగిని దివ్వేది.. సంజ‌న కుమ్ములాడుకుంటున్నార‌ట‌. ఇదిలా వుంటే రాగిణి దివ్వేది డాక్ట‌ర్ కే షాకిచ్చింద‌ని..‌. డ్ర‌గ్స్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వ‌మ‌ని డాక్ట‌ర్ అడిగితే యూరిన్ స్థానంలో వాట‌ర్ ఇచ్చిన షాకిచ్చింద‌ట‌. అయితే విష‌యం తెలుసుకున్న అధికారులు రాగిణిని హెచ్చిరించిన‌ట్టు తెలిసింది. ఇక‌పోతే రాగిణి ద్వివేది.. సాటి నాయిక సంజ‌న‌తో రూమ్ షేర్ చేసుకునేందుకు వ్య‌తిరేకించార‌ని ఆ స‌మ‌యంలో జైల‌ర్లు వినోదం ఎంజాయ్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.