Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ తో శ్రీలంకకు కాంగ్రెస్ ఎమ్మెల్యే...!
By: Tupaki Desk | 12 Sept 2020 3:20 PM ISTసినీ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. కర్ణాటక డ్రగ్స్ మాఫియా కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది మరియు సంజనా గల్రానీ అరెస్ట్ కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. వీరితోపాటు డ్రగ్స్ కేసులో మరో 12 మందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. డ్రగ్స్ కేసులో వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించడంతో కస్టడీకి తరలించారు.ఈ క్రమంలో సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త ప్రశాంత్ సంబర్గి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడని తెలుస్తోంది.
బాలీవుడ్ నటులు, పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను ప్రశాంత్ వెల్లడించినట్టు సమాచారం. గతంలో శ్రీలంక క్యాసినోలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలకు సినీ తారలు భారీగా హాజరయ్యారని.. సంజన గల్రానీ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ ఖాన్ కూడా వచ్చారని ప్రశాంత్ చెప్పినట్టు బెంగళూరు మిర్రర్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ ఖాన్ ఖండించారు. సంజన గల్రానీ ఎవరో తెలియదని.. ఆమె నటించిన సినిమాలు కూడా ఇంత వరకు చూడలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారని తెలుస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే చమ్రాజ్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.