Begin typing your search above and press return to search.

ర‌ష్యాలో హీరోయిన్ ర‌చ్చ‌.. పిక్స్, వీడియోస్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   15 July 2021 5:03 AM GMT
ర‌ష్యాలో హీరోయిన్ ర‌చ్చ‌.. పిక్స్, వీడియోస్ వైర‌ల్!
X
సినిమా నటులకు కావాల్సింది పాపులారిటీ. అయితే.. ఎవరు, ఎప్పుడు, ఎలా ఫేమస్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. కొంత మందికి ఎంత కష్టపడ్డా రాని పాపులారిటీ.. కొందరికి సింగిల్ డేలో వచ్చేస్తుంది. ఓవ‌ర్ నైట్ లో స్టార్ అయిపోతారు. అలాంటి వారిలో ఒకరు ప్రియా వారియర్. కేవలం ఒకే ఒకసారి కన్నుకొట్టి, చేత్తో బుల్లెట్ దింపి, దేశవ్యాప్తంగా ఉన్న యువకుల హృదయాలను ధ్వంసం చేసింది.

‘ఒరు ఆడార్ లవ్‌’ అనే సినిమాలో నటించిన ఆ మ‌లయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.‌ ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో కన్ను గీటుతుంది. సినిమా టీజర్ లో వ‌దిలిన ఆ సీన్ చూసి యూత్ కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకేముంది..? రాత్రికి రాత్రే ప్రియా ప్రకాశ్ వారియర్ పెద్ద స్టార్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో నితిన్ హీరోగా తెర‌కెక్కిన‌ ‘చెక్’ చిత్రంలో న‌టించింది. అదేవిధంగా.. ‘శ్రీదేవి బంగ్లా’ అనే మరో సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. దీంతోపాటు.. జాంబీరెడ్డి హీరో.. తేజ స‌జ్జాతో క‌లిసి ‘ఇష్క్‌’ అనే చిత్రంలో నటించింది ప్రియా ప్రకాశ్. ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.

కాగా.. కేవ‌లం యాక్టింగ్ మాత్ర‌మే కాకుండా.. ఆమెలో ఓ మ‌ధుర‌మైన గాయ‌ని కూడా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల రూపొందించిన ఓ ఆల్బమ్ లో ప్రియా వారియర్ ఓ పాట పాడింది. స్వతహాగా మంచి సింగర్ అయిన‌ ప్రియా.. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాటలు పాడి మెప్పించింది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూ తన గానమాధుర్యాన్ని వినిపిస్తోంది.

ఇదిలాఉంటే.. ఈ భామ ఇప్పుడు ర‌ష్యాలో సంద‌డి చేస్తోంది. తేజ స‌జ్జాతో న‌టించిన ‘ఇష్క్’ మూవీలో నటించిన ప్రియా ప్రకాశ్.. షూటింగ్ కంప్లీట్ కావడంతో హాలిడే వెకేషన్ కోసం రష్యా చెక్కేసింది. రష్యా రాజధాని మాస్కోలో ఫ్రెండ్స్ కలిసి షాపింగులు, రైడింగులతో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఈ పిక్స్, వీడియోస్ వైర‌ల్ అవుతున్నాయి.