Begin typing your search above and press return to search.
హీరోయిన్ పూర్ణ బ్లాక్ మెయిల్ కేసులో ట్విస్ట్
By: Tupaki Desk | 4 July 2020 11:45 AM IST‘సీమ టపాకాయ్’.. ‘అవును’ సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ పూర్ణను కొందరు బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాప్ చేద్దామనుకున్న కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. ఈమెను బ్లాక్ మెయిల్ చేసిన సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇందులో నిందితులైన శరత్, అబూబాకర్, హారిస్ లకు వారంలో రెండు రోజులు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కోవాలని తెలిపింది. నటినే కిడ్నాప్ చేద్దామని చూసిన వీరికి బెయిల్ ఇవ్వడంపై హీరోయిన్ పూర్ణ కుటుంబం ఆందోళనగా ఉంది.
పూర్ణ అసలు పేరు షమ్మా కాసిం. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మను కిడ్నాప్ చేయాలని ఓ ముఠా ప్లాన్ చేసింది. భారీగా డబ్బు దోచుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ ముఠా ఆటకట్టైంది. ముఠాలోని 12మందిలో 8మందిని అరెస్ట్ చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ తెలిపారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ముఠా గత మార్చిలో పాలక్కాడ్ లో 8మంది మోడల్స్ ను బంధించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితులని పోలీసులు తెలిపారు. వీరి దందానే వర్ధమాన నటీనటులను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లమని నమ్మించి దోచుకోవడం అని తేల్చారు.
మొదట హీరోయిన్ పూర్ణాతో వివాహ ప్రతిపాదన చేసి కుటుంబంతో పరిచయం పెంచుకొని ఆమెను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలని ఈ ముఠా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే పూర్ణా నుంచి 1.50 లక్షలు డిమాండ్ చేశారు. పూర్ణా ఫ్యామిలీ ఇవ్వకపోవడంతో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. పూర్ణా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్యనటుడు ధర్మజన్ బోల్గట్టిను కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముఠా సభ్యులు బెయిల్ పై విడుదలయ్యారు.