Begin typing your search above and press return to search.

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై పోలీస్ కేసు

By:  Tupaki Desk   |   21 Aug 2021 8:12 AM IST
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై పోలీస్ కేసు
X
ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అందాల ఆరబోతలో అడ్డంకులు లేవని నిరూపించింది. ప్రేక్షకులకు హాట్ హాట్ అందాలు ఆరబోసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లోనూ అదే రేంజ్ లో సినిమాల్లో రెచ్చిపోతోంది.

వెంకటేశ్ సరసన వెంకీమామ, రవితేజకు జోడీగా డిస్కోరాజా వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆశించినస్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దాంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి.

తాజాగా పాయల్ రాజ్ పుత్ పై పోలీస్ కేసు నమోదైంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు నమోదైంది. గతనెల 11న పెద్దపల్లి పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ రాజ్ పుత్ పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే ఆమె మాస్క్ ధరించకపోవడంతో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫఇర్యాదు చేశారు. దీంతో జూనియర్ సివిల్ జడ్జి సిఫార్సు మేరకు పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. షాపు ఓపెనింగ్ కు భారీగా వసూలు చేసిన పాయల్ కు ఇప్పుడు లేనిపోని కష్టాలు దాపురించినట్టైంది. ఈ హాట్ బ్యూటీపై ఇలా కేసు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అసలు ఓపెనింగ్స్ పెట్టుకోకూడదన్న గుసగుసలు హీరోయిన్లలో వ్యక్తమవుతున్నాయి.