Begin typing your search above and press return to search.
మాజీ మంత్రిపై.. కోర్టుకెక్కిన హీరోయిన్!
By: Tupaki Desk | 24 July 2021 11:30 PM GMTతనతో ఐదేళ్లపాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ పై కోలీవుడ్ నటి చాందిని ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని కోరితే కుదరదని చెబుతున్నాడని, ఈ విషయాన్ని బయట పెడితే.. సీక్రెట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది చాందిని. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే.. తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించింది చాందిని.
తాజాగా.. తనకు పదికోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరుతూ.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తన జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడంతో తాను అన్ని విధాలుగా నష్టపోయానని, చెన్నైలోనే ఉండి కోర్టు వ్యవహారాలు చూసుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొంది. అందువల్ల తనకు నెలవారీగా అయ్యే ఖర్చులు కూడా మాజీ మంత్రి మణికందనే భరించాలని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం.. ఆగస్టు 5వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
కాగా.. మలేషియాలో పుట్టిన చాందిని.. సినిమాలపై కోరికతో చెన్నైలో అడుగు పెట్టింది. 'నాడోదిగల్' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కూడా అయ్యింది. అయితే.. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి మణికందన్ తో పరిచయం పెరిగింది. ఆ తర్వాత సహజీవనం వరకూ వెళ్లిందని, ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకోమంటే.. దూరం పెడుతున్నాడని పోలీసులను ఆశ్రయించింది చాందిన.
అయితే.. ఈ ఆరోపణలను మణికందన్ ఖండించడం గమనార్హం. ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఆమెను చట్ట పరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు తేలకుండానే.. తనకు 10 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలంటూ చాందిని మరో కేసు వేయడం గమనార్హం. మరి, ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.