Begin typing your search above and press return to search.

ఆరెక్స్ హీరో కోసం కొత్త మలయాళి అందం!

By:  Tupaki Desk   |   19 Jan 2019 9:31 AM GMT
ఆరెక్స్ హీరో కోసం కొత్త మలయాళి అందం!
X
మొదటి సినిమా 'RX100' తోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కొత్త తెలుగు హీరో కార్తికేయ. స్టార్ కిడ్స్ ఆపసోపాలు పడుతున్నా దక్కని విజయాన్ని ఇలా మొదటి సినిమాకే అందుకోవడం గొప్ప విషయమే. 'RX100' తర్వాత కార్తికేయ వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ ప్రాజెక్టులలో ఒకటి బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా.

ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా మలయాళంలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనఘ మురుతోరను ఫిక్స్ చేశారట. ఈ మలయాళ సుందరికి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ బ్యూటీ లాస్ట్ ఇయర్ తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందట. ఇప్పుడు తెలుగును కూడా కవర్ చేస్తోంది. ఈ బ్యూటీ ఏదో నార్త్ భామల్లా ఎర్రగా బుర్రగా ఉండే కేటగిరీ మాత్రమే కాదు. ట్రెయిన్డ్ క్లాసికల్ డ్యాన్సర్. అంటే డ్యాన్స్ ను దుమ్ము దులిపే రకం.

కార్తికేయ మొదటి సినిమాతో పాయల్ రాజ్ పుత్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు రెండో సినిమాతో అనఘకు కూడా అలాంటి అదృష్టం పడుతుందేమో వేచి చూడాలి. ఇప్పటికే మళయాళ బ్యూటీలు టాలీవుడ్ ను ఏలుతున్నారు.. ఆ లిస్టులో కొత్త బ్యూటీ చేరినట్టే.