Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాకు హీరోయిన్ కష్టాలు తప్పవా..?

By:  Tupaki Desk   |   24 May 2021 11:00 PM IST
ప్రభాస్ సినిమాకు హీరోయిన్ కష్టాలు తప్పవా..?
X
యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ - బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ తో సహా ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ రావడం లేదు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ ఎండింగ్ లేదా జూలై నెల ప్రారంభంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు నాగ్‌ అశ్విన్‌ ఆ మధ్య వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు దృష్ట్యా ముందు అనుకున్న ప్రకారం షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాక ప్రీ ప్రొడక్షన్ - విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హడావుడిగా స్టార్ట్ చేసే ఉద్దేశ్యం అసలే లేదని నాగ్ అశ్విన్ చెప్తున్నారట. అయితే ఈ సినిమా లేట్ అవుతూ ఉండటంతో దీపికా డేట్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం దీపిక పదుకునే జులై నుంచి డేట్స్ అడ్జస్ట్ చేసిందట. కానీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో అవి వేస్ట్ అయిపోతాయి. మళ్లీ డేట్స్ ఇవ్వడానికి దీపికా వచ్చే ఏడాది క్యాలెండర్ ఫుల్ బిజీగా వుంది. దీపికా ప్రస్తుతం 'సర్కస్' సినిమాతో పాటుగా షారుక్ ఖాన్ తో 'పఠాన్' సినిమా చేస్తోంది. అలానే శకున్ బత్రా దర్శకత్వంలో ఓ మూవీ.. అమితాబ్‌ బచ్చన్ తో 'ది ఇంటర్న్' రీమేక్ చిత్రాల్లో నటిస్తోంది. ఇదే క్రమంలో అజయ్ దేవగణ్‌ తో 'మ్యాగ్నమ్ ఓపస్'.. మధు మంతెన దర్శకత్వంలో 'ద్రౌపది'.. హృతిక్ రోషన్ తో 'ఫైటర్' చిత్రాలు కమిట్ అయింది. ఇంత బిజీ షెడ్యుల్ ని అడ్జస్ట్ చేసుకొని ప్రభాస్ సినిమాకి దీపికా డేట్స్ ఇవ్వాలంటే కాస్త ఇబ్బందే. నాగ్ అశ్విన్ కరెక్ట్‌ గా ప్లాన్ చేసుకోకపోతే.. దీపిక డేట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేయక తప్పదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, పాన్ వరల్డ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.