Begin typing your search above and press return to search.
మా ఆయనతో విడిపోతున్నాః హీరోయిన్
By: Tupaki Desk | 2 April 2021 8:00 AM ISTతన భర్తతో విడిపోతున్నానని బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాము ఎవరి దారి వారు చూసుకోవాలని నిశ్చయించుకున్నామని ఆమె ప్రకటించారు. 2016లో ఆమె సాహిల్ ను వివాహం చేసుకున్నారు. తన భర్త ఎల్లప్పుడూ తనను ప్రోత్సహించేవాడని చెప్పే కుల్హరి.. ఉన్నట్టుండి విడిపోతున్నామని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
''నేను నా భర్త సాహిల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా జీవితంలో ఎవరి దారి వారు చూసుకోవాలని డిసైడ్ అయ్యాం. కలిసి ఉండాలని అనుకోవడం కన్నా.. విడిపోయే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే.. కలిసి జీవించినప్పుడు అందరూ స్వాగతిస్తారు. కానీ.. విడిపోవడానికి ఎవ్వరూ అంగీకరించరు. కానీ తప్పడం లేదు. దీని గురించి ఎవరూ ఎప్పటికీ కామెంట్ చేయొద్దు'' అంటూ పెద్ద పోస్టే రాశారు ఇన్ స్టా గ్రామ్ లో.
అయితే.. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ చేసే ప్రయత్నమేమీ కాదుగదా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ధైర్యంగా ఈ విషయాన్ని వెల్లడించడం గొప్ప విషయమని అంటున్నారు. మరి, ఇందులో ఏది నిజమన్నది చూడాలి.