Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో పేరు మార్చుకుని ఫేట్ మార్చుకున్న హీరోలు..!

By:  Tupaki Desk   |   18 May 2021 9:00 AM IST
సినీ ఇండస్ట్రీలో పేరు మార్చుకుని ఫేట్ మార్చుకున్న హీరోలు..!
X
జనరల్ గా సినిమా వాళ్ళకి నమ్మకాలు కొంచెం ఎక్కువని అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో జరిగే వాటిని గమనిస్తే సెంటిమెంట్లకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అర్థం అవుతుంది. సినిమాకి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు ప్రతీది ముహూర్తం చూసుకునే చేస్తారు. ఇక సినీ తారలు - సంఖ్యా శాస్త్రం మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూమరాలజీ కారణంగా చాలా మంది అగ్ర తారలు పేర్లు చేంజ్ చేసుకున్నారు. సంఖ్యా శాస్త్రాన్ని నమ్మి పేర్లు మార్చుకున్న నటీనటులు కొందరైతే.. రియల్ నేమ్ బాగాలేదని మరో స్క్రీన్ నేమ్ పెట్టుకున్న వారు మరికొందరు. అదే పేరుతో మరొకరు ఉండటం వాళ్ళ పేర్లు మార్చుకున్న వారు ఇంకొందరు. లక్కీ స్టోనో, న్యూమరాలజీనో గ్రాఫాలజీనో తెలియదు కానీ ఇండస్ట్రీలో వెలుగొందిన చాలా మంది స్టార్స్ పేరు మార్చుకున్నవారే. అలాంటి హీరోల జాబితాను ఇప్పుడు చూద్దాం!

సూపర్ స్టార్ గా ఎదిగిన నటశేఖర కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. సోగ్గాడు శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు. మెగాస్టార్ గా అశేష అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్న చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు మంచు భక్త వత్సలం నాయుడు అనే విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాక ముందు రజినీ కాంత్‌ పేరు శివాజీ రావు గైక్వాడ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు అని చాలా మందికి తెలియదు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ రియల్ నేమ్ గద్దె వెంకట నారాయణ. 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ స్క్రీన్ నేమ్ గా తేజ్ తీసేసి రామ్ చరణ్ గా కొనసాగిస్తున్నారు. అలానే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ మధ్య సాయి తేజ్‌ గా టైటిల్ కార్డ్ వేయించుకుంటున్నాడు. 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యాక్షన్ హీరో అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జా.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టీ ఇస్మాయిల్ పనిపరంబిల్. తమిళ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్ కాగా.. తమ్ముడు కార్తీ పూర్తి పేరు కార్తీక్. ధనుష్ రియల్ నేమ్ వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. హీరో ఆర్య అసలు పేరు జంషెడ్ సెథిరాకాత్. ఆర్బీ చౌదరి తనయుడు జీవా అసలు పేరు అమర్ చౌదరి. 'కండల వీరుడు' సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్ ఖాన్. అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. అజయ్ దేవ్‌గణ్ ఒరిజినల్ పేరు విశాల్ దేవ్‌గణ్. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీలో పేరు మార్చుకుని ఫేట్ మార్చుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు.