Begin typing your search above and press return to search.
హీరోల సోషల్ మీడియా ఫాలోవర్స్ వారి సినిమాలను చూడరెందుకో..!
By: Tupaki Desk | 22 Dec 2020 6:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. సినిమా విషయాలతో పాటు ఫ్యామిలీ పర్సనల్ విషయాలు మరియు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ అందరికీ చేరువలో ఉంటారు మహేష్. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ ను సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్ కు చేరింది. దీంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కోటి పది లక్షల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది. ఇక ఇన్స్స్టా గ్రామ్ లో మహేష్ ని 6.1 మిలియన్స్ మంది అనుసరిస్తున్నారు. అలానే ఫేస్ బుక్ లో కూడా మహేశ్ ఫాలోయింగ్ 5.8 మిలియన్స్ పైనే ఉంది. అంటే రమారమి చూసుకుంటే మొత్తంగా మహేశ్ కి ఉన్న డిజిటల్ ఆర్మీ దాదాపుగా 23 మిలియన్ ఉంది.
టాలీవుడ్ నుంచి డిజిటల్ ఆర్మీ పరంగా చూసుకుంటే మహేష్ తో పాటు అక్కినేని నాగార్జున - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ - దగ్గుబాటి రానా వంటి హీరోలు ఎక్కువ మంది ఫాలోవర్స్ తో కొనసాగుతున్నారు. అయితే కోట్ల కొలదీ ఫాలోవర్స్ ఉన్నా వీరు నటించే సినిమాలను ఎందుకు చూడటం లేదనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. నిజానికి సోషల్ మీడియాలో వీరిని అనుసరిస్తున్న వారిలో సుమారు 10 శాతం మంది ఆ హీరోలు నటించే సినిమాలను తొలి మూడు రోజులు చూసినా ప్రతి సినిమా కూడా బంపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పవచ్చు. టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అలా జరగడం లేదు. దీంతో వీరిలో దాదాపు పెయిడ్ స్పాన్సర్ షిప్ ద్వారా వచ్చిన వారే ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. అందుకే డిజిటల్ ఫాలోవర్స్ లో రష్యా టర్కీ వంటి ఇతర దేశాల వారు కూడా ఉంటారని కామెంట్స్ వస్తున్నాయి.