Begin typing your search above and press return to search.
నాతో రొమాన్స్ చేసేందుకు హీరోలు భయపడ్డారు: తాప్సీ
By: Tupaki Desk | 29 Jun 2021 8:48 AM ISTస్టార్ హీరోయిన్ తాప్సీ.. తాజాగా తాను నటించిన లేటెస్ట్ మూవీ 'హసీన్ దిల్రుబా' సినిమా ప్రమోషన్స్ కారణంగా మీడియాతో మాట్లాడింది. అలాగే సినిమాకు సంబంధించి పలు క్రేజీ విషయాలు ఆమె బయటపెట్టింది. అయితే కామెడీ - క్రైమ్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే - హర్షవర్ధన్ రాణే హీరోలుగా నటించారు. అయితే తాజాగా తాప్సీ ఈ హీరోలతో సినిమాలో రొమాంటిక్ సీన్స్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. "ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నాతో రొమాన్స్ చేయడానికి హీరోలు (విక్రాంత్ - హర్షవర్ధన్) ఇద్దరూ భయపడ్డారు.
తాప్సీ మాతో ఏం చేస్తుందిలే అనుకున్నారు. కానీ రొమాన్స్ చేసేటప్పుడు వారే భయపడ్డారు. మొత్తానికి కంఫర్ట్ గానే ఆ సీన్స్ చేసానని అనుకుంటున్నాను. నాకైతే తెలియదు నాతో రొమాన్స్ చేసేందుకు హీరోలు ఎందుకు భయపడ్డారో.. నాకు తెలిసి నా ఇమేజ్ కారణంగా కావచ్చు లేదా ఇంకేదైనా కారణం ఉండవచ్చు" అంటూ చెప్పింది. అలాగే మీరు శృంగార సన్నివేశాల్లో నటించే ముందు మీ బాయ్ ఫ్రెండ్ కు తెలియజేస్తారా..? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది తాప్సీ. "లేదు. నా రొమాన్స్ సీన్స్ గురించి నా బాయ్ ఫ్రెండ్ తో చెప్పను. ఎందుకంటే ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. మా పర్సనల్ లైఫ్ లోకి ప్రొఫెషనల్ విషయాలు తీసుకురాను. అలాగే తాను కూడా నా నుండి పర్మిషన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచించడు." అని చెప్పింది.
ఇక ఈ సినిమా లవ్.. లస్ట్.. మర్డర్ నేపథ్యంలో తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే విక్రాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తాప్సీ క్యారెక్టర్.. పెళ్లి తరువాత భర్త ఉండగానే మరో మగాడిని ముగ్గులోకి దింపి అఫైర్ మెయింటైన్ చేయడం అర్ధమవుతుంది. ఈ సినిమాకు కనికా దిల్లాన్ స్టోరీ అందించగా.. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆనంద్ ఎల్ రాయ్ - భూషణ్ కుమార్ - హిమాన్షు శర్మ - క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తాప్సీ ఏడు సినిమాల్లో నటిస్తోంది. అందులో మూడు తమిళం - నాలుగు హిందీ సినిమాలున్నాయి. మొత్తానికి తాప్సీ బాలీవుడ్ లో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. చూడాలి మరి హసీన్ దిల్రుబాతో మరో హిట్ అందుకుంటుందేమో!