Begin typing your search above and press return to search.

హీరోలే కాల్ చేసి ఆ విషయాలు అడుగుతారు: సుధీర్ బాబు

By:  Tupaki Desk   |   16 May 2021 3:30 AM GMT
హీరోలే కాల్ చేసి ఆ విషయాలు అడుగుతారు: సుధీర్ బాబు
X
తెలుగు ఇండస్ట్రీలో మెల్లమెల్లగా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ హీరోగా సెటిల్ అవుతున్నాడు యువనటుడు సుధీర్ బాబు. కెరీర్ ప్రారంభం 'శివమనసులోశృతి' నుండి డిఫరెంట్ రోల్స్ - మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ సెలెక్టివ్ గా ముందుకు వెళ్తున్నాడు. మహేష్ బాబు రిలేటివ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సుధీర్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంటాడు. అయితే హిట్స్ ప్లాప్స్ సంగతి పక్కనపెడితే సుధీర్ మాత్రం రొటీన్ సినిమాలు చేయడం లేదు. గతేడాది వి అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆ సినిమాలో సుధీర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

అయితే ప్రస్తుతం సుధీర్.. శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నాడు. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సూరిబాబు అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అయితే ఇటీవలే సుధీర్ పుట్టినరోజు జరగడంతో ఆ సందర్బంగా శ్రీదేవి సోడా సెంటర్ మేకర్స్ సుధీర్ కు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ఫిదా చేసాడని చెప్పాలి. బేసిగ్గా సుధీర్ ఫిట్నెస్ ఫ్రీక్. ఎల్లప్పుడూ వర్కౌట్స్ తో సినిమాలకు కావాల్సిన విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు. అయితే గ్లింప్స్ చూసాక చాలామంది హీరోలు సుధీర్ ను ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో చెప్పాలని కాల్ చేసి మరీ అడిగారట.

ఆ విషయాన్నీ స్వయంగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే సుధీర్ సింపుల్ గా వ్యాయామంతో పాటు డైట్ మెయింటైన్ చేస్తే బాడీ మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చని హీరో తెలిపాడట. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమా అనంతరం సుధీర్ మరోసారి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మరో సినిమా చేయనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ప్రకటించారు మేకర్స్. సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇదివరకే సమ్మోహనం, వి సినిమాలకు కలిసి పనిచేసారు.