Begin typing your search above and press return to search.

కొత్త లుక్ తో ట్విస్ట్ ఇచ్చిన కెజిఎఫ్ 2

By:  Tupaki Desk   |   3 Jun 2019 4:52 AM GMT
కొత్త లుక్ తో ట్విస్ట్ ఇచ్చిన కెజిఎఫ్ 2
X
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయం సాదించి ఇప్పటిదాకా ఏ కన్నడ డబ్బింగ్ సినిమా రాబట్టని వసూళ్లు తెచ్చిన కెజిఎఫ్ సీక్వెల్ కు ఇంకా చాలా టైం ఉన్నా అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఎదురుచూపులు మొదలుపెట్టారు. షూటింగ్ కొంతకాలం క్రితమే ప్రారంభమయ్యింది. ఇప్పటికే కీలక భాగం పూర్తయ్యిందని ఇంకో ఆరేడు నెలల్లో మొత్తం ఫినిష్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ సమయం కేటాయిస్తారట.

తాజాగా ఇందులో స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. మంచి రాయల్ లుక్ తో సూటు బూటు వేసుకుని జుత్తు గెడ్డం మొత్తం స్టైలిష్ గా మార్చుకున్న రాఖీ భాయ్ గా యష్ కొంచెం కొత్తగా ఉన్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పెత్తనం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న రాఖీ భాయ్ పక్కా బిజినెస్ మెన్ గా మారినట్టు ఉన్నాడు. ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా ఉందీ లుక్

వచ్చే సమ్మర్ లో కెజిఎఫ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గరుడను చంపిన తర్వాత కోలార్ గనులను తన హస్తగతం చెసుకున్న రాఖీ భాయ్ కర్ణాటక నుంచే ఢిల్లీ రాజకీయాలను శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ తో ఇది రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ పార్ట్ కంటే రెండింతలు ఎక్కువ యాక్షన్ మసాలా ఇందులో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే హామీ ఇచ్చాడు. బాలీవుడ్ ద్వయం సంజయ్ దత్ - రవీనాటాండన్ లతో పాటు తెలుగు నుంచి రావు రమేష్ లాంటి యాక్టర్స్ అందరూ భాగం పంచుకుంటున్న కెజిఎఫ్ చాప్టర్ 2కి సుమారు 150 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.