Begin typing your search above and press return to search.

2020 స‌మ్మ‌ర్‌ లో `కె.జి.ఎఫ్‌ 2`ట్రీట్‌

By:  Tupaki Desk   |   13 March 2019 6:10 AM GMT
2020 స‌మ్మ‌ర్‌ లో `కె.జి.ఎఫ్‌ 2`ట్రీట్‌
X
రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా న‌టించిన కెజిఎఫ్ చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నాల గురించి మ‌ర్చిపోక ముందే `కెజిఎఫ్ చాప్ట‌ర్ 2` చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాని దాదాపు 200కోట్ల బ‌డ్జెట్ తో బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కించేందుకు ప్ర‌ఖ్యాత హోంబ‌లే సినిమాస్ సంస్థ భారీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కూ క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ క్లాప్ కొట్టిన స‌న్నివేశాన్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్.. రిలీజ్ త‌దిత‌ర విష‌యాలు తెలియ‌రాలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1` కంటే నాలుగు రెట్లు అదిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ హోంబ‌లే ఫిలింస్ సంస్థ తో మంత‌నాలు సాగించార‌ని తెలుస్తోంది. `కెజిఎఫ్ చాప్ట‌ర్ 2 `చిత్రాన్ని నేడు బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్‌ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఉద‌యం 9.30కు లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడు ఓ కొత్త పాత్ర‌ను పోషిస్తున్నారు. కెజిఎఫ్ చాప్ట‌ర్ 1 కి టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తే.. `కెజిఎఫ్ 2`కి కైకాల వార‌సుడు కైకాల రామారావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముహూర్త‌పు షాట్ ప్రారంభోత్స‌వంలో కైకాల రామారావు స‌హా, చిత్ర‌ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, రాకింగ్ స్టార్ య‌శ్, క‌థానాయిక శ్రీ‌నిధి శెట్టి త‌దిత‌రులు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

అలాగే ఈ సినిమాను ఈ నెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. అక్టోబ‌ర్ తో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ నుంచి సీజీ వ‌ర్క్ స‌హా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తారు. 2020 వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ‌వుతుంది. చాప్ట‌ర్ 1లో న‌టించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ స్టార్లు ఇందులో న‌టిస్తున్నారు. తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వారాహి చ‌ల‌న‌చిత్రం స‌హా రాజ‌మౌళి స‌న్నిహితుడు సాయి కొర్ర‌పాటి వంటి బిగ్ షాట్స్ అండ‌దండ‌లు హోంబ‌లే కు ఉన్నాయ‌న్న‌ది మ‌రో స‌మాచారం లీకైంది. చాప్ట‌ర్ 1 ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో కె.జి.ఎఫ్ సీక్వెల్ పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. పార్ట్ 2లో భారీ తారాగ‌ణం న‌టించ‌నున్న‌ నేప‌థ్యంలో బ‌డ్జెట్ స్కేల్ ని అమాంతం పెంచేశార‌ట‌. తెలుగులోనూ అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కొర్రపాటి, రాజ‌మౌళి వంటి ప్ర‌ముఖులు అండ‌గా నిలుస్తున్నార‌ట‌.