Begin typing your search above and press return to search.

రాఖీ భాయ్ ని చంపేస్తారా ?

By:  Tupaki Desk   |   18 March 2019 9:17 AM GMT
రాఖీ భాయ్ ని చంపేస్తారా ?
X
ఇటీవలే ప్రారంభమైన కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ఎప్పుడు పూర్తయి విడుదల అవుతుందో తెలియదు కానీ అప్పుడే దీనికి సంబంధించిన ఊహాగానాలు మొదలైపోయాయి. శాండల్ వుడ్ లో దీనికి సంబంధించిన లీకులు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా రాఖీ భాయ్ కెజిఎఫ్ గనులను తన ఆధీనంలోకి తీసుకుని చనిపోయిన గరుడ స్థానాన్ని ఆక్రమించడం తర్వాత శత్రువులందరూ ఒక్కటై రాఖీ భాయ్ ని టార్గెట్ చేయడం లాంటివన్నీ ఇందులో ఉంటాయట.

ముఖ్యంగా చాలా కీలకమైన క్లైమాక్స్ లో రాఖీ భాయ్ పాత్రకు ట్రాజెడీ ఫినిషింగ్ ఇవ్వక తప్పదనే మాట వినిపిస్తోంది. ఎంత హీరోయిజం చూపించినా ఇలాంటి వాటిలో ఇలాంటి ఎండింగ్ తప్పదు. కమల్ హాసన్ నాయకుడు మొదలుకుని ఎన్నో ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇప్పుడు కెజిఎఫ్ కూడా అదే దారిలో ఉన్నట్టు సమాచారం. అయితే శత్రువు చేతిలో చనిపోతాడా లేక ప్రభుత్వం పంపిన బలగాలు రాఖీ భాయ్ ని తుదముట్టిస్తాయా అనేది సస్పెన్స్ గా పెడుతున్నారు.

చాప్టర్ 1 తీస్తున్న సమయంలోనే సీక్వెల్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసినట్టుగా టాక్ ఉంది. కానీ రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి క్లారిటీ రావడానికి ఇంకొంత టైం పడుతుంది. సంజయ్ దత్ రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో ఉంటారన్న వార్తలు సైతం ధృవీకరణ జరగాల్సి ఉంది. అన్నట్టు కెజిఎఫ్ కన్నడ వెర్షన్ శాటిలైట్ వెర్షన్ ప్రసారం ఈ నెల 30న చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చి చాలా రోజులు అయినప్పటికీ రేటింగ్స్ బాగా వస్తాయన్న నమ్మకంతో దీన్ని టెలికాస్ట్ చేస్తున్న కలర్స్ కన్నడ ఛానల్ ఉంది