Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క సినిమాతో ఆ జాబితాలో చోటు

By:  Tupaki Desk   |   15 Feb 2019 10:06 AM GMT
ఒకే ఒక్క సినిమాతో ఆ జాబితాలో చోటు
X
కన్నడ హీరో యష్‌ గురించి మూడు నెలల ముందు వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే 'కేజీఎఫ్‌' చిత్రం గురించి పబ్లిసిటీ మొదలు అయ్యిందో అప్పుడు సౌత్‌ ఇండియ మొత్తం కూడా యష్‌ గురించి మాట్లాడుకోవడం మొదలు అయ్యింది. ఇక కేజీఎఫ్‌ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్‌ లో కూడా యష్‌ గురించిన చర్చ మొదలైంది. బాలీవుడ్‌ లో 'కేజీఎఫ్‌' చిత్రం భారీ వసూళ్లను సాధించింది. కన్నడ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డులను సొంతం చేసుకున్న కేజీఎఫ్‌ చిత్రంతో యష్‌ ఒక్కసారిగా సూపర్‌ స్టార్‌ అయ్యాడు.

కేవలం స్టార్‌ హీరోలు మాత్రమే చోటు దక్కించుకున్న మోస్ట్‌ డిసైరబుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జాబితాలో ఈసారి యష్‌ చోటు సంపాదించుకున్నాడు. మోస్ట్‌ డిసైరబుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇండియా 2018 జాబితాలో యష్‌ కు స్థానం దక్కింది. అది కూడా నెం.1 స్థానంలో నిలిచాడు. కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా యష్‌ స్టార్‌ డంను దక్కించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌ పార్ట్‌ 2 కు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్ట్‌ 2 ను అత్యంత భారీగా బాలీవుడ్‌ రేంజ్‌ లో రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.