Begin typing your search above and press return to search.

తనపై ట్రోలింగ్ ని లైక్ చేసిన హీరో..!

By:  Tupaki Desk   |   30 Dec 2020 7:00 AM IST
తనపై ట్రోలింగ్ ని లైక్ చేసిన హీరో..!
X
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లేటెస్ట్ మూవీ కూలీ నెం1. ఆయన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గత శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్.. అందులోని ఓవరాక్షన్ చూసి హీరో వరుణ్ ధావన్ ను, ఫాదర్ కం డైరెక్టర్ డేవిడ్ ధావన్ ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం బోయపాటి, బాలయ్య సీన్లను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా.. ట్రైన్ సీన్ ను ‘ఓవర్ యాక్షన్ కా బాప్’ అంటూ నిందిస్తున్నారు. స్టేషన్లో రైలు పట్టాలపై ఓ బాబు కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ప్లాట్ ఫాంపై ఉన్న వారు ట్రైన్ వస్తోందని అరుస్తుండగా.. వంతెన పైనున్న హీరో వరుణ్ ధావన్.. దూసుకెళ్తున్న ట్రైన్ మీద దూకుతాడు. అదే ట్రైన్ పై పరిగెత్తి ఇంజిన్ వద్దకు వెళ్లి ట్రైన్ మీద నుంచి కిందకు దూకి రెప్పపాటులో బాబును తీసుకొని పక్కకు జరుగుతాడు.’ ఈ సీన్ ను చూసి ప్రతిఒక్కరూ ఎగతాళి చేస్తున్నారు. వరుణ్ పోర్టర్ కాదు.. సూపర్ మ్యాన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

కాగా.. వరుణ్ ధావన్ గత మూవీ సీరియస్ థ్రిల్లర్ ‘బద్లాపూర్’లో తన నటనా నైపుణ్యానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ చిత్రాన్ని, కూలీ నెం1తో కంపేర్ చేస్తూ.. అతని తండ్రి, దర్శకుడు అయిన డేవిడ్ ధావన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. దీనికి సంబంధించి ట్విటర్ లో ఓ ఇమేజ్ ట్రెండ్ అవుతోంది.

వరుణ్ ధావన్ ‘బద్లాపూర్’, కూలీనెం.1 చిత్రాలను జత చేసి "భారతీయ తండ్రులు చేసే పనులకు వ్యతిరేకంగా పిల్లలు ఏమి చేయగలరు?" అంటూ.. వరుణ్ పరిస్థితిపై జాలి చూపిస్తున్నారు. డైరెక్టర్ గా ఉన్న తండ్రి చెప్పిందే వరుణ్ చేశాడంటూ హీరో పట్ల సానుభూతి చూపుతున్నారు. కాగా.. ఈ ట్వీట్ ను వరుణ్ ధావన్ లైక్ చేయడం విశేషం. అంటే అర్థం ఏమై ఉంటుంది?