Begin typing your search above and press return to search.

మందు కొట్టి చిరు వీడియోలు చూసే హీరో

By:  Tupaki Desk   |   23 July 2019 11:36 AM IST
మందు కొట్టి చిరు వీడియోలు చూసే హీరో
X
కొన్ని బయటికి కనిపించని విచిత్రాలు పరిశ్రమలో అందులోనూ తారల ఇళ్లల్లో జరగడం సర్వసాధారణం. అలాంటిదే ఇది కూడా. అతనో క్రేజీ స్టార్ హీరో. ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అవుతోంది. మాస్ సినిమాలతో ఓ రేంజ్ లో మార్కెట్ ఏర్పరుచుకున్న ఇతనికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది. అయితే అన్ని రకాల వేషాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం బాగా దగ్గరవ్వాలని ట్రై చేస్తున్న ఇతనికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే అలవాటు విపరీతంగా ఉంది. కారణం చిరు కామెడీ టైమింగ్.

రోజు సాయంత్రం షూటింగ్ లేకుండా ఫ్రీగా ఇంట్లో ఉన్న టైంలో ఇతను చేసే పని మందు కొడుతూ తన హోమ్ థియేటర్లో చిరు కామెడీ పండించిన సినిమాలను చూడటమేనట. చంటబ్బాయి-అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - ఘరానా మొగుడు - శంకర్ దాదా ఎంబిబిఎస్ వీడియోలను పదే పదే చూస్తూ మాస్ హీరోకు అంత పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఎలా కుదిరిందన్న దాని మీద ఒకటే ఆలోచిస్తూ ఉంటాడట. అంతే కాదు అవే సన్నివేశాలు తనూ ట్రై చేస్తూ ఎలా వచ్చాయన్న కంపారిజన్ లో ఎక్కువ టైం గడుపుతాడు.

ఇది అతనికి అతి దగ్గరగా సన్నిహితంగా మెలిగే వాళ్ళు చెప్పిన సమాచారం. నిజానికి ఓ మాస్ హీరో కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా చేయడంలో ఇప్పటికీ చిరుని మించిన వారు లేరనే మాట వాస్తవం. జై చిరంజీవా లాంటి డిజాస్టర్ సైతం అంతో ఇంతో చూసేలా ఉంటుందంటే దానికి కారణం త్రివిక్రమ్ మాటలతో పలికించిన చిరు కామిక్ సెన్స్. అది స్వంత ఫ్యామిలీ హీరోలు సైతం అడాప్ట్ చేసుకోలేకపోయారు.

కానీ ఇప్పుడీ హీరో మాత్రం చిరు తర్వాత ఆ స్థాయిలో తనకూ పేరు రావాలని బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడట. చిరుని రోల్ మోడల్ గా తీసుకోవడం మంచిదే.కాకపోతే ఇమిటేట్ చేయకుండా స్వంతంగా ఓ స్టైల్ ని ఏర్పరుచుకుంటే ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధపడతారు. ఆ హీరో ఎవరు అని అడగకండి. అతని ప్రైవేట్ వ్యవహారాన్ని మనమూ ప్రైవసీ మైంటైన్ చేసి గౌరవిద్దాం.