Begin typing your search above and press return to search.

మ‌హేశ్ మేన‌ల్లుడు వ‌ర్సెస్ దిల్ రాజు కొడుకు!

By:  Tupaki Desk   |   2 Jan 2022 11:30 PM GMT
మ‌హేశ్ మేన‌ల్లుడు వ‌ర్సెస్ దిల్ రాజు కొడుకు!
X
పాన్ ఇండియా మూవీ RRR సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డంతో వ‌రుస పెట్టి సినిమా రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను చిన్న సినిమాల‌ రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టించారు. ఇంకో అర‌డ‌జ‌ను ప్ర‌క‌టించేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ఇదిలా ఉంటే సంక్రాంతి ముందు సంద‌డి చేసే చిత్రాల్లో పెద్ద సినిమాలు కాకుండా మిడ్ రేంజ్ లో చ‌ర్చ‌కు వ‌చ్చే రెండు సినిమాలు ఏవీ? అంటే..

పెద్ద సినిమాలు విడుద‌ల అవ్వ‌క‌పోతే కొద్దో గొప్పో న్యూస్ లో వ‌చ్చే సినిమాలు హీరో- రౌడీ బాయ్స్..!. ఇందులో రౌడీ బాయ్స్ జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంటే ఒక‌రోజు గ్యాప్ తో అంటే జ‌న‌వ‌రి 15న హీరో విడుద‌ల‌వుతోంది. హీరో మూవీలో అశోక్ గ‌ల్లా హీరో. అశోక్ మ‌హేష్ మేన‌ల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్స్ ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో బెస్ట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో అశోక్ డెబ్యూ ఉంటుందన‌డంలో సందేహం లేదు. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ చిత్రం రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే రౌడీ బాయ్స్ చిత్రంతో దిల్ రాజు సోద‌రుడు శిరీష్ కుమారుడు ఆశిష్ తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు త‌మ వార‌సుడిని ప‌క్కాగా ప్రిపేర్ చేసి బ‌రిలో కి వ‌దులుతున్నారు. కాలేజ్ నేప‌థ్యంలోని రౌడీ బాయ్స్ టీజ‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆస‌క్తిని పెంచాయి. హీరో వ‌ర్సెస్ రౌడీ బాయ్స్ స‌న్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక సంక్రాంతి బ‌రిలో రాధేశ్యామ్ అనే భారీ చిత్రం మిన‌హా ఇత‌ర సినిమాల‌న్నీ చిన్న సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టిస్తున్న సూపర్ మ‌చ్చి కూడా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ ప‌రంగా అంత హైప్ క‌నిపించ‌లేదు. అన్న‌ట్లు అత‌డు న‌టిస్తున్న మ‌రో మూవీ కిన్నెర‌సాని కూడా ఈ సీజ‌న్ లోనే విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అయితే కిన్నెర‌సాని పైనా క‌ళ్యాణ్ దేవ్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. సంక్రాంతి రేసులో సూప‌ర్ మ‌చ్చి ఏ మేర‌కు పోటీనిస్తుందో వేచి చూడాలి.