Begin typing your search above and press return to search.

సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   19 Sep 2021 1:30 PM GMT
సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన  స్టార్ హీరో
X
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టారు తమిళ హీరో విజయ్. గత ఎన్నికల సమయంలో తండ్రిపై కేసు పెట్టిన హీరో విజయ్.. తాజాగా తల్లిదండ్రులపై కేసు పెట్టడం సంచలనమైంది.

తల్లిదండ్రులతో సహా 11 మందిపై కేసు పెట్టాడు విజయ్. తన అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన పేరు మీద లేదా అతడి అభిమాన సంఘం పేరును ఉపయోగించుకుండా నిరోధించాలని కోరుతూ చెన్నై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల్లో తన అభిమాన సంఘం 'విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్' స్వతంత్ర్యంగా పోటీచేస్తుందని ఆయన తెలిపారు.

ఏడాది క్రితం విజయ్ పేరుతో పార్టీ పెట్టి తండ్రి చంద్రశేఖర్.. 'విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో పార్టీ పెట్టారు. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు.

తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని ఇప్పటికే పలు మార్లు మీడియాకు వెల్లడించారు హీరో విజయ్. ఈనేపథ్యంలోనే తన పేరు దుర్వినియోగం చేయవద్దని కేసు పెట్టినట్టు విజయ్ వెల్లడించారు.