Begin typing your search above and press return to search.

మంచి మనసు చాటుకున్న హీరో విజయ్

By:  Tupaki Desk   |   14 Aug 2019 10:08 AM GMT
మంచి మనసు చాటుకున్న హీరో విజయ్
X
సినిమా ఇండస్ట్రీలో తానో మనసున్న మంచి హీరో అని విజయ్ నిరూపించుకున్నారు. తన కోసం కష్టపడ్డ వాళ్లకు మరిచిపోలేని బహుమతిని ఇచ్చి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. విజయ్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ కు ఆ సినిమా కోసం పనిచేసిన 400 మంది ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ ను వేయినోళ్ల పొగుడుతున్నారు.

తమిళ అగ్రహీరో విజయ్ ను అందరూ ఇళయ దళపతి అని పిలుస్తుంటారు. సినిమాపై ప్రేమ ఎంతో ఉందో.. తన సినిమా కోసం పనిచేసిన వారిపై కూడా అంతే ప్రేమ చూపించాడు విజయ్.

తెరి- మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ అట్లీతో కలిసి విజయ్ తీసిన తాజా సినిమా ‘బిగిల్’. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. నయనతార హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇన్ని రోజులు తన సినిమా కోసం కష్టపడ్డ మొత్తం 400 చిత్రం యూనిట్ సభ్యులకు చివరిరోజు విజయ్ అదిరిపోయే రీతిలో సెండాఫ్ బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

తన బిగిల్ సినిమాకు పనిచేసిన మొత్తం వివిధ శాఖల్లోని 400 మందికి బంగారు ఉంగరాలు బహుమతిగా అందించాడు. అంతేకాదు ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీకి గుర్తుగా విజయ్ - దర్శకుడు అట్లీ సంతకాలు చేసిన ఫుట్ బాల్స్ ను పంచిపెట్టారు.

షూటింగ్ కు వచ్చాక, పూర్తయ్యిందా వెళ్లామా ? హిట్ కొట్టిందా అని మాత్రమే చూసుకునే హీరోలున్న ఈరోజుల్లో తన సినిమా కోసం కష్టపడ్డ వాళ్లకు ఏకంగా బంగారు ఉంగరాలు ఇచ్చిన విజయ్ పై యూనిట్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘బిగిల్ ’ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్ మీడియాలో బంగారు ఉంగరాన్ని చూపించి మరీ విజయ్ మాపై కురిపించిన ప్రేమ ఎంతో ప్రత్యేకం అని ట్వీట్ చేసింది. ఉంగరాలు తీసుకున్న అందరూ సోషల్ మీడియాలో విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.