Begin typing your search above and press return to search.

తల్లి బాటలో హీరో తరుణ్.. మరో అవతారం..??

By:  Tupaki Desk   |   28 May 2021 4:54 PM GMT
తల్లి బాటలో హీరో తరుణ్.. మరో అవతారం..??
X
టాలీవుడ్ హీరోలు అప్పుడప్పుడు వేరే అవతారాలలో ప్రత్యక్షం అవుతుంటారు. అందులో ఒకటి డబ్బింగ్ ఆర్టిస్ట్. తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు హీరో తరుణ్. అదికూడా ఓ డబ్బింగ్ వెర్షన్ సినిమాకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే అది 'ఆహా' అనే చెప్పాలి. కేవలం తెలుగు ప్రేక్షకులకోసం ప్రారంభమై తెలుగు సినిమాలు షోలు వెబ్ సిరీస్ లను అందిస్తోంది. అదేవిధంగా ఈ మధ్య ఎక్కువగా వేరే భాషల్లో సూపర్ హిట్ అయినటువంటి సినిమాలను డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్నారు. అలా తెలుగులోకి డబ్ అవుతోంది మలయాళం 'అతిరన్' మూవీ.

మలయాళంలో రెండేళ్ల క్రితమే విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు ఆహా వారు తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ - సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1970కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ వివేక్. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో 'అనుకోని అతిథి' అనే పేరుతో ఆహా వారు రిలీజ్ చేస్తున్నారు. మే 28 నుండి అంటే ఈరోజు నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన ఫాహద్ ఫాజిల్ పాత్రకు టాలీవుడ్ హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పాడని సమాచారం. ప్రస్తుతం తరుణ్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలియగానే సోషల్ మీడియాలో అటు పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే హీరోగా మంచి ఫామ్ కొనసాగించిన తరుణ్.. పదేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టీవ్ గా లేడు. అలాగని సినిమాలు చేస్తున్నాడా అంటే అదికూడా లేదు. కానీ తరుణ్ చివరిగా 'ఇది నా లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారంలో మెరిసే సరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం అయితే తరుణ్ కొత్త సినిమాలెవి ప్రకటించలేదు. కానీ డబ్బింగ్ చెప్పడనే విషయం తెలియగానే తరుణ్ కూడా తల్లి బాటలోనే వెళుతున్నాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తరుణ్ తల్లి రోజారమణి కూడా ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అందరికి తెలిసిందే. ఇప్పుడు కొడుకు అదే బాటలో అడుగులు వేసే సరికి ఫ్యాన్స్ అలా రియాక్ట్ అవుతున్నారు. చూడాలి మరి ఇకపై కూడా ఇలా వేరే అవతారల్లో అలరిస్తాడేమో..!