Begin typing your search above and press return to search.

తరుణ్ అక్కడో రాయేస్తున్నాడు

By:  Tupaki Desk   |   18 Aug 2015 7:08 AM IST
తరుణ్ అక్కడో రాయేస్తున్నాడు
X
తరుణ్.. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. ‘నువ్వే కావాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరో అవతారమెత్తి.. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సూపర్ హిట్లతో తారాపథానికి దూసుకెళ్లిన తరుణ్ కోసం నిర్మాతలు క్యూ లైన్ లో ఉండేవారు అప్పట్లో. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో హీరోగా బాగా వెనుకబడిపోయాడు తరుణ్. గత పదేళ్లలలో అతడికి ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. సఖియా సినిమాతో మొదలుపెట్టి సోగ్గాడు, ఒక ఊరిలో, శశిరేఖా పరిణయం, భలే దొంగలు, నవవసంతం, . ఇలా ఆశలు పెట్టుకున్న ప్రతి సినిమా నిరాశ పరిచింది. గత మూణ్నాలుగేళ్లుగా పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, యుద్ధం, వేట లాంటి సినిమాలైతే వచ్చిన సంగతి కూడా తెలియదు. టాలీవుడ్ లో అతడి కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది. తనతో సినిమాలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఐతే గతంలో పొరుగున కోలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసిన తరుణ్.. ఇప్పుడు కన్నడ సినిమాలపై కన్నేశాడు. అక్కడ ఒన్దు లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నాడు తరుణ్. లవర్ బాయ్ గా తరుణ్ కు మంచి పేరుంది. శాండిల్ వుడ్ లో ఇప్పుడలాంటి వేషమే వేస్తున్నాడు కుర్రాడు. ఈ సినిమా హిట్టయితే సాయికుమార్ లాగే హీరోగా కన్నడనాటే సెటిలైపోదామని చూస్తున్నాడు. అతడి ఆశ నెరవేరుతుందేమో చూడాలి.