Begin typing your search above and press return to search.

ఒక్క పోస్టర్ తో తలలు తిప్పేశాడు

By:  Tupaki Desk   |   1 Jun 2017 10:58 AM GMT
ఒక్క పోస్టర్ తో తలలు తిప్పేశాడు
X
గోదావరి అందాలను చూపించాలన్నా.. తెలుగు చమత్కారంతో చక్కలిగింతలు పెట్టాలన్నా.. అది ఒక్క డైరెక్టర్ వంశీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన తీసిన సితార - చెట్టు కింద ప్లీడర్ - లేడీస్ టైలర్ - ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలు.. తెలుగులో క్లాసికల్ మూవీస్ గా నిలిచిపోయాయి. గొప్ప వీరోచిత సన్నివేశాలు ఉండవు.. స్టార్ హీరో హీరోయిన్లు ఉండరు.. భారీ సెట్లు ఉండవు.. కానీ అవి మన సినిమాలుగా మనలో ఒకడి సినిమాలుగా అందరి మదిలో మధుర జ్ఞాపకంలా మిగిలిపోతాయి.

ఇప్పుడు కూడా అలాంటి మరో సరదా సినిమా ''ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్'' తో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ వంశీ. ఈ సినిమా పాత లేడీస్ టైలర్ కు కొనసాగింపు అని అప్పటిలో వార్తలు వచ్చాయి కానీ అవి ఏమి వాస్తవం కాదు అని సినిమా ట్రెయిలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇంకా పోతే ఈ సినిమా మార్కెటింగ్ వాళ్ళు మొదలపెట్టకముందే మొదలైంది. సినిమా పోస్టర్ లో అమ్మాయి కొలతలు తీస్తున్న ఒక టైలర్ ఫోటో కనిపిస్తుంది. ఈ ఒక్క ఫోటో చెబుతుంది మళ్ళీ వంశీ తన మ్యాజిక్ ని తిరగరాయొచ్చని. ఈ సినిమా పోస్టర్ చేస్తున్న సందడి అంతాఇంతా కాదు దాదాపు ప్రతీ ఊరులోనూ ప్రతీ గోడ మీదా.. ఇదే పోస్టర్. ఇప్పుడు ఈ పోస్టర్ సెగలు అందరికీ తగిలి సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అన్న ఆత్రంతో ఉన్నారు జనాలు. కేవలం ఒక్క పోస్టర్ తోనే తలలన్నీ సినిమావైపు తిప్పేశారని చెప్పొచ్చు.

రేపు సినిమాకు ఈ పోస్టర్ కారణంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇప్పుడు అయితే సోషల్ మీడియా డిజిటల్ టి‌విలు ఉన్నాయి కానీ వంశీ తొలినాళ్లలో ఇటువంటి మార్కెట్ అవకాశాలు లేవు. ఒక్క పోస్టర్ తోనే సినిమా కథ ఏంటో ఎలా ఉండబోతుందో చెప్పాలి. వంశీ గారికి అది బాగా తెలుసు. ఇప్పుడు ఈ సినిమాను ఆ పాత పద్దతిలోనే మార్కెట్ చేసి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి రేపు కంటెంట్ కూడా ఆకట్టుకుంటే.. ఇక హిట్టు కొట్టినట్లే. ఈ సినిమాను మధురా శ్రీధర్ రెడ్డి నిర్మించగా.. సుమంత్ అశ్విన్ హీరో గా అనిష్ అంబ్రోస్, మనాలి హీరోయిన్లాగా నటిస్తున్నారు. సంగీతం మణిశర్మ కొంపోజ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/