Begin typing your search above and press return to search.

మా కోసం మేము.. అంటున్న సునీల్

By:  Tupaki Desk   |   27 April 2018 8:14 AM GMT
మా కోసం మేము.. అంటున్న సునీల్
X

ఈమధ్య శ్రీరెడ్డి ఇష్యూలో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మూవీ ఆర్టిస్ట్ట అసోసియేషన్ (మా) ఆ వివాదం నుంచి బయటపడి కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. మా మొదలుపెట్టి 25 సంవత్సరాలు అయింది. ఈ సందర్గంగా సినిమా కళాకారుల్లో వృద్ధులైన వారికోసం ఓల్డేజ్ హోమ్ కట్టించాలని మా డిసైడైంది.

మా కట్టించబోయే ఓల్డేజ్ హోమ్ కు ఫండ్ రైజింగ్ కోసం సినిమా స్టార్లంతో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. మొదటగా ఏప్రిల్ 27న అమెరికాలోని డల్లాస్ లో ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి మెయిన్ అట్రాక్షన్. ఆయనతోపాటు దాదాపు 35 మంది యాక్టర్లు ఈ ఈవెంట్లో సందడి చేస్తారు.

ఈ ఈవెంట్లో హీరో సునీల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ‘‘ఈ ఈవెంట్ కు టిక్కెట్ గా వెచ్చించే మొత్తం పదిమందికి మేలు చేసే కార్యక్రమం కోసం ఖర్చు చేస్తాం కాబట్టి పుణ్యం కూడా సంపాదించుకున్నట్టే. ఇంతకుముందు బాడీ బిల్లింగ్ కోసం నేను ఓ ట్రస్ట్ ఆద్వర్యంలో నడిచే జిమ్ లో చేరాను. పక్కనే నాతోపాటు కొందరు వేరే జిమ్ లో చేరారు. నాకు బాడీ వచ్చింది కానీ వాళ్లకు రాలేదు. మంచి పనితో చేసే పనికి ఫలితం ఉంటుంది అనడానికి ఇదో ఎగ్గాంపుల్. ’’ అంటూ సునీల్ ఇన్ స్పిరేషన్ గా మాట్లాడాడు. దీని తరవాత ఈవెంట్ మహేష్ బాబుతో ప్లాన్ చేశామని... ఒక్కస్టార్ ఒక్కో సిటీకి వస్తారని మా ప్రెసిడెంట్ శివాజీరాజా, హీరీ శ్రీకాంత్ ప్రకటించారు.