Begin typing your search above and press return to search.

'ఇష్క్' ప్రమోషన్స్ లో హీరో కష్టాలు.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   16 April 2021 1:18 PM GMT
ఇష్క్ ప్రమోషన్స్ లో హీరో కష్టాలు.. వీడియో వైరల్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు తేజ సజ్జా. ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన తేజ ఆ సినిమాతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా భారీ హిట్ కాకపోయినా నిర్మాతను మాత్రం కాపాడిందని చెప్పాలి. అందుకే తేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా తేజ మరో సినిమాతో రెడీ అయిపోయాడు. ఇష్క్ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. 'ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ చూస్తే సినిమా లవ్ స్టోరీ కాదని అర్ధమవుతుంది. ఏప్రిల్ 23న సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్బంగా ప్రీ-ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో తేజ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ జరిపే అవకాశం లేదు కాబట్టి ఇలా వెరైటీగా ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ వీడియోలో తేజ ఓ సెలబ్రిటీని ప్రీ-రిలీజ్ కు పిలవడానికి కాల్ చేసినట్లుగా ఫన్నీగా వీడియో క్రియేట్ చేసాడు. యాక్టింగ్ కాదు కానీ ప్రస్తుత సమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పిలవడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో చాలా ఫన్నీగా చూపించాడు. ఈ సంభాషణలో జాంబిరెడ్డి, నితిన్, ఇష్క్ మూవీ, రీమేక్, ఇంద్ర, తొడగొట్టటం లాంటి టాపిక్స్ అన్ని తీసాడు. కానీ చివరిలో అవతల వ్యక్తిని ఒప్పించలేక ప్రీ-రిలీజ్ లేదు. నెక్స్ట్ టైం పెట్టుకుంటే పిలుస్తామంటూ చెప్పడంతో ఎండ్ చేసాడు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియోతో సినిమా 23న రిలీజ్ అవుతోంది అనే విషయం మాత్రం మళ్లీ మళ్లీ గుర్తుచేసాడు. ఈ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రసాద్, పరాస్ జైన్, అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించాడు.