Begin typing your search above and press return to search.

రివ్యూల‌పై హీరోలో అసంతృప్తి

By:  Tupaki Desk   |   2 Dec 2018 10:15 AM GMT
రివ్యూల‌పై హీరోలో అసంతృప్తి
X
స‌మీక్ష‌లు కొన్ని సార్లు చిత్ర‌క‌థానాయ‌కులు - మేక‌ర్స్ ని ఇర్రిటేట్ చేస్తుంటాయి. మా సినిమా ఇదీ.. అదీ అని చెప్పిన మేక‌ర్స్‌ - హీరోల‌కు వీటితో నిరాశ‌ త‌ప్ప‌నిస‌రి. స‌రిగ్గా అలాంటి స‌న్నివేశమే శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్‌ కు - ఆయ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వ‌చ్చింది. స‌మీక్ష‌లు చాలా నిరాశ‌ప‌రిచాయ‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేస్తే స‌మీక్ష‌లు ఇలా వ‌స్తాయ‌ని ఊహించ‌లేద‌ని శ్రీ‌కాంత్ వాపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

శ్రీ‌కాంత్ హీరోగా క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌కుడిగా అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో టి. అలివేలు నిర్మించిన `ఆప‌రేష‌న్ 2019` ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్‌ - మంచు మ‌నోజ్ - సునీల్ తారాగ‌ణం. ఆదివారం నాడు స‌క్సెస్ వేడుక‌లో హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ-``ఇదో ప్ర‌పోజ‌ల్‌ తో తీసిన చిత్రం. ప్ర‌స్తుతం స‌మాజంలో ఉండే ప‌రిస్థితుల‌కి అనుగుణంగా ఉన్న చిత్ర‌మిది. ఈ మ‌ధ్య‌కాలంలో నేను న‌టించిన చిత్రాల్లో నాకు న‌చ్చిన చిత్ర‌మిది. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ప‌బ్లిక్ టాక్ చాలా ఇంపార్టెంట్‌. ప్ర‌తి ఒక‌ళ్ళూ క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మిది. ప్రొడ్యూస‌ర్ ఈ చిత్రం కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ సేఫ్ కావాల్సి ఉంది. ఎవ్వ‌రికీ న‌ష్టం రాకూడ‌దు. అంతా బానే ఉంది కానీ... మాకు కొంత అసంతృప్తి అన్న‌ది కొన్ని రివ్యూస్ వ‌ల్ల అనిపించింది. ఎవ‌రి అభిప్రాయం వాళ్ళ‌ది. మేము మీ అభిప్రాయాన్ని గౌర‌విస్తున్నాం కాద‌న‌డంలేదు కానీ... ఒక రివ్యూ ఇచ్చేట‌ప్పుడు కొంచెం ఆలోచించాలి. ప్రొడ్యూస‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి ఒక చిత్రాన్ని నిర్మిస్తాడు. అందులో ఎంతోమంది టెక్నీషియ‌ల‌న్ల‌కి ప‌ని దొరుకుతుంది. మీరు అలా రాయ‌డం వ‌ల్ల కేవ‌లం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్ళేవారు చాలా మంది ఉంటారు. ఒక స‌క్సెస్ వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది టెక్నీషియ‌న్ల‌కి ప‌ని దొరికిన‌ట్లే. అంద‌రూ థియేట‌ర్‌ కి వెళ్ళి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి చివ‌రి వ‌ర‌కు ప్రేక్ష‌కులు మ‌ధ్య‌లో లేవ‌కుండా సినిమా మొత్తం చూసి బ‌య‌ట‌కు వ‌చ్చాడంటే సినిమా స‌క్సెస్ సాధించిన‌ట్లు`` అని క్లాస్ తీస్కున్నారు.

ఈ చిత్రం చూస్తే చాలా మంది జ‌నాల్లో ఓటు ఎవ‌రికి వెయ్యాలి అన్న అవేర్‌ నెస్ వ‌స్తుంది. ఈ చిత్రం చేసిన త‌ర్వాత అప్పుడ‌ప్పుడూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తే బావుంట‌ద‌నిపించింద‌ని శ్రీ‌కాంత్ అన్నారు. అంతా బాగానే ఉంది కానీ, కేవ‌లం స‌మీక్ష‌లు చ‌దివి వాటినే వంద‌శాతం ప్రాతిపదిక‌గా తీసుకుని జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేద‌ని ఇటీవ‌ల చాలా సినిమాలు నిరూపించాయి. అయితే త‌న సినిమా సమీక్ష‌ల‌ విష‌యంలో శ్రీ‌కాంత్ ఎమోష‌న్ అయ్యారంతేన‌ని అనుకోవాలేమో!! బాలేదు అని ఎవ‌రూ అన‌లేదు అంటూనే .. ఆ పాయింటునే నొక్కి చెప్ప‌డంలో అర్థ‌మేంటో ప్రేక్ష‌కులే అర్థం చేసుకోవాలి?!