Begin typing your search above and press return to search.

డర్టీ హరి బోల్డ్‌ సీన్‌ ల్లో సహజత్వం ఉట్టిపడుతుందట

By:  Tupaki Desk   |   15 Dec 2020 10:07 AM IST
డర్టీ హరి బోల్డ్‌ సీన్‌ ల్లో సహజత్వం ఉట్టిపడుతుందట
X
నిర్మాతగా ఎన్నో సూపర్‌ హిట్స్‌ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎంఎస్‌ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన 'డర్టీహరి' సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోని కారణంగా సినిమాను ఏటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే సినిమా కు సంబంధించిన ప్రమోషన్స్‌ తో దుమ్ము రేపుతున్నారు. ఈ సినిమాలో ఉన్న బోల్డ్‌ కంటెంట్‌ మొత్తంను పబ్లిసిటీ కోసం వినియోగిస్తున్నారు. సినిమా మొత్తం బోల్డ్‌ అన్నట్లుగా ప్రమోషన్‌ చేస్తున్నారు. యూత్‌ ఆడియన్స్‌ టార్గెట్‌ గా రూపొందిన ఈ సినిమాలో బోల్డ్‌ సీన్స్ చాలా సహజంగా సహజత్వంతో కూడినవిగా ఉంటాయంటూ హీరో గా నటించిన శ్రవణ్‌ రెడ్డి అన్నాడు.

సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన శ్రవణ్‌ రెడ్డి సినిమా గురించిన పలు విషయాలను తెలియజేశాడు. హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన నేను ముంబయిలో పలు షోలు సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశాను. నేను ఈ సినిమా చేయడానికి కారణం కంటెంట్‌. సినిమాలో కథ చాలా బలంగా అనిపించింది. హీరో అంటే ఇలా ఉండాలి అనుకునే వారికి ఇలా కూడా హీరో ఉంటాడా అనిపించేలా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. సహజత్వంతో కూడిన పాత్రలతో ఈ సినిమా సాగుతుంది.

సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిన తర్వాత హీరోయిన్స్‌ తో మంచి పరిచయం అయ్యి ఒకరిని ఒకరు తెలుసుకున్న తర్వాత బోల్డ్‌ సీన్స్‌ చేశాం. అప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సహజంగా బోల్డ్‌ సీన్స్‌ ఉండేందుకు చాలా ప్రయత్నించారు దర్శకుడు. ఆయన సినిమాను విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. 40 ఏళ్ల లోపు వారు అందరికి కూడా తమ సినిమా ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతుందని శ్రవణ్‌ రెడ్డి అంటున్నాడు.