Begin typing your search above and press return to search.

సముద్రం మధ్యలో ఫ్లెక్సీలేంటి రాజా

By:  Tupaki Desk   |   28 Jan 2019 8:39 AM GMT
సముద్రం మధ్యలో ఫ్లెక్సీలేంటి రాజా
X
ఎవరెన్ని చెప్పిన సినిమా హీరోల మీద అభిమానంలో తమిళ తంబీలకు ఎవరు పోటీ రారు. ఇలా కూడా పిచ్చి ఉంటుందా అని రుజువు చేసుకోవడంలో వాళ్ళకు వాళ్ళే సాటి. ఫిబ్రవరి 1న విడుదల కానున్న శింబు వంత రాజవంతాన్ వరువెన్ కోసం భారీ ఎత్తున పాలభిషేఖాలు చేయమని స్వయంగా హీరో ఇచ్చిన పిలుపు ఇప్పటికే అక్కడ దుమారం రేపింది. ఎవరో ఒక నెటిజెన్ శింబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్న మాటను పట్టుకుని ఇలా పనిగట్టుకుని హంగామా చేయడం గురించి ఇప్పటికే వివాదం నడుస్తోంది. ఆ రోజు పాల దొరకవనే ఉద్దేశంతో అభిమానులు ఇప్పటి నుంచే భద్రపరిచే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా పాండిచేరి ఫ్యాన్స్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా సముద్రం నడిమధ్య ఓ భారీ ఫ్లేక్సీ బ్యానర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చూడాలంటె పడవేసుకుని పోవాల్సిందే. ఒడ్డున చూసినా కనిపించేలా అత్యంత భారీగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇది మొదటి సారి కాదు. ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది అజిత్ ఫ్యాన్స్. మొన్న సంక్రాంతికి విడుదలైన విశ్వాసంకు ఇలాగే బ్యానర్ కట్టి సెన్సేషన్ చేసారు. మేమేం తక్కువ తిన్నామా అంటూ శింబు ఫ్యాన్స్ అంత కన్నా పెద్ద ఫ్లెక్సీ తో రెడీ అవ్వడం విశేషం.

అయినా సైజు ఏదైనా అది సినిమా ఆడుతున్న థియేటర్ కు కడితే అందం కాని ఇలా సముద్రం మధ్య కట్టడం ఏమిటో వాళ్ళకే తెలియాలి. శింబు పిలుపు ఇచ్చాకే ఇలాంటివి ఇంకా ఎక్కువవుతున్నాయి. ఈ వంత రాజవంతాన్ వరువెన్ మన అత్తారింటికి దారేది రీమేక్. సమంతా పాత్రను మేఘ ఆకాష్ నదియా రోల్ రమ్య కృష్ణ చేస్తున్నారు. పోటీకి భయపడి రెండు వారాలు వాయిదా వేసి ఎట్టకేలకు ఫిబ్రవరి 1 తెస్తున్నారు. సినిమాలో విషయమేమో కాని ఈ రకంగా ఫ్రీ పబ్లిసిటీ అయితే పుష్కలంగా వచ్చేస్తోంది