Begin typing your search above and press return to search.
స్టార్ హీరో చెల్లికి బ్రేకప్ చెప్పి మరదలికి లైనేశాడు!
By: Tupaki Desk | 23 July 2020 12:30 PM IST4 ఏళ్ల ఆమెతో ఎఫైర్ సాగిస్తూ ఆ కుర్రహీరో నిరంతరం మీడియాలో హాట్ టాపిక్. తనకంటే పదేళ్ల పెద్ద వయసు ఉన్నా ఏదీ లెక్క చేయక ఎవరినీ ఖాతరు చేయక అతడు ప్రేమాగీమా అంటూ వేడెక్కిస్తున్నాడు. అతడి నాన్నకు నచ్చదు. ఆవిడగారి బావగారైన అగ్ర హీరోకి నచ్చదు. అయినా అదీ ఖాతరు చేయకుండా ఆ ఎఫైర్ కి తానా తందానా అన్నాడు.
ఇదంతా ఎవరి గురించి? అంటే... అర్జున్ కపూర్ (32) గురించే. తనకంటే పదేళ్లు పెద్దది అయిన మలైకా అరోరా (44)తో ఎఫైర్ సాగిస్తున్నాడు. ఆ ఇద్దరిమధ్యా బంధంపై రకరకాల చర్చ సాగుతోంది. ఇలాంటి టైమ్ లో కూడా అతడు తాను ‘సింగిల్’ అని సోషల్ మీడియాలో అభిమానులతో అన్నాడు. అసలింతకీ ఏం జరుగుతోంది? అన్నది ఆరా తీస్తే.. చాలా సంగతులే తెలిశాయి. 
2019 జనవరి లోనే మలైకా అరోరా - అర్జున్ కపూర్ బీచ్ లో ఒకరిపై ఒకరు తమ ప్రేమను చాటుకుంటూ కనిపించారు. అర్జున్ చెంపపై మలైకా పెదవి ముద్దును ఫ్యాన్స్ మరువనే లేదు ఇంకా. ఆ తర్వాత రిసార్టుల్లో పబ్బుల్లో షికార్లను ఎవరూ మరవలేదు. డిన్నర్ డేట్ అంటూ ఔటింగుల గురించి చర్చ సాగింది.
మరోవైపు ఆ ఇద్దరూ అలా షికార్లు చేస్తుంటే.. తరచూ వారి వయస్సు వ్యత్యాసంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. కాని అర్జున్ మరియు మలైకా తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అదే మీడియా ప్రచారం చేసింది. కానీ కొన్నాళ్ల క్రితం అర్జున్ తాను ఇంకా “సింగిల్” అని సోషల్ మీడియాలో సూచించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి ప్రకటనలతో అతడు ఏం చెప్పదలిచాడు? అన్నది గందరగోళంగానే ఉంది. ఆ మాటను అర్థం చేసుకోవడానికి అభిమానులకు చాలా కష్టంగా ఉంది.
నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్‌తో మలైకా తన 21 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించి అర్జున్ ని నమ్మి వచ్చేసింది. ఇప్పుడు అతడు యూటర్న్ తీసుకుంటున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొదట సల్మాన్ ఖాన్ మరియు అతని కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్న అర్జున్ ఇప్పుడు పూర్తిగా దూరమైపోయాడు. అతన్ని క్షమించడానికి సల్మాన్ సిద్ధంగా లేనే లేడట.
అర్జున్ మొదట సల్మాన్ చెల్లెలు అర్పితతో డేటింగ్ చేశాడు. అతను ఆమెతో విడిపోయి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ను వివాహం చేసుకున్న మలైకా అరోరాతో స్నేహం చేసాడు. ఆ సమయంలోనే సల్మాన్ అర్జున్ పై కోపం తెచ్చుకున్నారు. సోదరుడు అర్బాజ్ నుండి మలైకా విడాకులు తీసుకున్న తరువాత అర్జున్ తో ఆమె బహిరంగంగా కనిపించడం .. ఆ జంట వివాహం గురించి గుసగుసలాడుకోవడం సల్మాన్ కి మంట పుట్టించింది. ఇటీవల అర్జున్ అంటేనే భగభగ మండుతున్నాడు అతడు. అందుకే ఇప్పుడు అతడు యూటర్న్ తిప్పి నేను సింగిల్ అన్నాడంటే దీనర్థం ఏమిటో తెలియక అంతా గందరగోళంలో ఉన్నారు మరి.