Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్..? అమ్మాయి ఎవరంటే..?

By:  Tupaki Desk   |   27 Jun 2022 7:43 AM GMT
పెళ్లి పీటలెక్కబోతున్న రామ్..? అమ్మాయి ఎవరంటే..?
X
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చినా సినిమా కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. డాన్సులు, ఫైట్స్, నటనలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ క్రమంలో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు.. మార్కెట్ ను బాగా పెంచుకొని ఉస్తాద్ హీరోగా మారిపోయాడు. అయితే ఇస్మార్ట్ హీరో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

2006లో 18 ఏళ్ల వయసులోనే 'దేవదాస్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. 16 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఇక ఆయన పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే 35 ఏట అడుగుపెట్టిన హ్యాండ్సమ్ హీరో వివాహం గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రామ్ ఈ ఏడాదే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఆషాడ మాసం ఉన్న కారణంగా ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారట. అలాగే, కార్తీక మాసంలో అంటే వచ్చే నవంబర్ లో రామ్ పెళ్లి చేయాలని ఇంట్లో అనుకుంటున్నారట.

హీరో రామ్ సినీ రంగానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మాత్రం తన చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో ఉన్నాడని.. ఆమెనే వివాహం చేసుకోబోతున్నాడని అంటున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని.. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకారం తెలిపారని.. ఈ క్రమంలోనే పెళ్లి ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఇస్మార్ట్ శంకర్' తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్.. 'రెడ్' చిత్రంతో పర్వాలేదనిపించారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది రాపో కి ఫస్ట్ బైలింగ్విల్ మూవీ.. అలానే తమిళ్ డెబ్యూ సినిమా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. జూలై రెండో వారంలో విడుదల చేయనున్నారు.

దీని తర్వాత బోయపాటి శ్రీను తో కలిసి రామ్ ఓ భారీ సినిమా ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది. డబ్బింగ్ చిత్రాలతో నార్త్ మార్కెట్ లో క్రేజ్ సంపాదించుకున్న రామ్.. ఈసారి హిందీలో తన చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.